వెంకటేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: బర్త్ డే కానుకగా రీ రిలీజ్ అవుతున్న మీ ప్రియమైన మూవీ!
Nov 27, 2026 3:16PM

ఆదర్శ కుటుంబం ఫలితంతో డల్ గా ఉన్న ఫ్యాన్స్ అప్ కమింగ్ మూవీ జనవరి 13 విడుదలతో హిట్ కొట్టి సినీ మార్కెట్ లో తల ఎత్తుకొని తిరగాలని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ తలలు నెక్స్ట్ మంత్ లోనే ఎగరేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇది మా ఘన చరిత్ర అని. పైగా థియేటర్స్ లో డాన్స్ లు సైతం.అది కూడా ఫుల్ ఎనర్జీతో.
వెంకటేశ్, ఐపిఎల్ పంజాబ్ ఓనర్, సినీ నటి ప్రీతి జింటా కాంబోలో వచ్చిన ‘ప్రేమంటే ఇదేరా’ 4K నాణ్యతతో రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రచార ప్రకటన వెలువడింది. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13 న థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఒకప్పుడు ఈ సినిమా చూసి అభిమానులు ఆస్వాదించిన ప్రేమ, భావోద్వేగాలు, అందమైన పాటలు ఇప్పుడు మరింత మెరుగైన విజువల్ క్వాలిటీతో వెండితెరపై కనిపించనున్నాయి. పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం దక్కనుంది.

పాటలతో ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు
‘ప్రేమంటే ఇదేరా’ కి సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రమణ గోగుల అందించిన పాటలు అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలను ఇష్టపడే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు.వెంకటేశ్, ప్రీతి జింటా కెమిస్ట్రీ, సంగీతం, ప్రేమకథ కలగలిపి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అందుకే రీ రిలీజ్ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
ఇది కూడా చదవండి: సౌత్ ఇండియా హిట్ డైరెక్టర్లందరిపై మైత్రి మేకర్స్ కన్ను: ఆ స్కెచ్ వేసింది అందుకోసమే!
పాత సినిమాలకు మళ్లీ థియేటర్లలో ఆదరణ
ఇటీవలి కాలంలో పాత హిట్ సినిమాలను కొత్త టెక్నాలజీతో రీ-రిలీజ్ చేయడం టాలీవుడ్‌లో మంచి ట్రెండ్‌గా మారింది. తమ అభిమాన హీరోల సినిమాలను మళ్లీ థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పుడు ‘ప్రేమంటే ఇదేరా’ కూడా అదే బాటలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈసారి థియేటర్లలో వెంకీ అభిమానులు సందడి చెయ్యడం షురూ. మీరు కూడా వాళ్ళతో కలిసి తెలుగు సినిమా అందించిన ప్రేమ, పరువపు సువాసనని తనివితీరా ఆస్వాదించండి. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించాడు. 1998 అక్టోబర్ 30 న థియేటర్స్ లోకి వచ్చింది!
మీకు నచ్చవచ్చు
పక్కా రొమాంటిక్ థ్రిల్లర్ మీ కోసమే ఓటిటిలోకి వచ్చేసింది: మిస్ అయితే మాత్రం...
రామాయణ తెరకెక్కించిన విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
[Venkatesh, Preity Zinta, Premante Idhera, Jayanth C paranzee,Tollywood]



