అజిత్,విజయ్ ల మధ్య గొడవ
on Jan 10, 2014
తమిళంలో నేడు ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు విడుదలయ్యాయి. వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరో అజిత్ "వీరం" కాగా, మరొకటి విజయ్ "జిల్లా". ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఈరోజు తమ సత్తా ఏంటో చూపించడానికి విడుదలయ్యాయి.
అజిత్ నటించిన "వీరం" లో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఇందులో అజిత్ మాస్ పాత్రలో నటించాడు. శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. అదే విధంగా విజయ్ నటించిన "జిల్లా" లో మోహన్ లాల్ ఒక ప్రధాన పాత్రలో నటించాడు. నేసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి నిర్మించారు. ఇందులో విజయ్ సరసన కాజల్ అగర్వాల్ జతకట్టింది. డి.ఇమాన్ సంగీతం అందించాడు. మరి ఈ రెండు చిత్రాలు ఎంత వరకు విజయం సాధిస్తాయో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.