
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి' కోసం సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది? మహేష్ బాబు పార్ట్ ఎంత మిగిలింది? అనుకున్న డేట్‌కి రిలీజ్ అవుతుందా? అంటూ అభిమానులు చర్చించుకుంటూనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా గురించి నెట్టింట ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది.
రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను 90 శాతానికి పైగా పూర్తి చేశారని సమాచారం. మనం ఇంకా షూటింగ్ ఏ దశలో ఉందో అని అనుకుంటుంటే, జక్కన్న మాత్రం సైలెంట్‌గా మెజారిటీ పార్ట్ పూర్తి చేసేశారు. మరో విశేషం ఏంటంటే.. మహేష్ బాబుకు సంబంధించిన కీలకమైన మేజర్ పోర్షన్స్ షూటింగ్ ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయిపోయింది.
కేవలం మహేష్ బాబుకు సంబంధించిన ఒక క్రూషియల్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో ఎంట్రీ సీన్లు థియేటర్లలో సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాయి. ఇప్పుడు 'వారణాసి'లో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కూడా అంతర్జాతీయ స్థాయిలో, మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో ప్లాన్ చేశారట. ఈ ఒక్క షెడ్యూల్ పూర్తయితే మహేష్ బాబు టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్లే.

ఒకవైపు షూటింగ్ నడుస్తుండగానే.. మరొకవైపు డబ్బింగ్, ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, VFX పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఎక్కడా టైమ్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ VFX కంపెనీలతో జక్కన్న టీమ్ నిరంతరం వర్క్ చేస్తోంది.
ఈ గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ లో ప్రపంచస్థాయి ప్రొడక్షన్ వాల్యూస్, కళ్లు చెదిరే విజువల్స్ ఉండబోతున్నాయి. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని రఫ్ లుక్‌లో పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు రాజమౌళి. ఇప్పటికే పూర్తి చేసుకున్న పోర్షన్స్ చూసిన యూనిట్ వర్గాలు అవుట్‌పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాయట.
ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ షూటింగ్ పూర్తి కావడంతో.. ముందుగా ప్రకటించినట్టుగానే 'వారణాసి' మూవీ ఏప్రిల్ 7, 2027న విడుదల కావడం ఖాయమనిపిస్తోంది.
[Varanasi Movie, Shooting Update, Mahesh Babu, Introduction Scene, SS Rajamouli, Telugu Film News, Tollywood News, Telugu News]






