
-18 నుంచే ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సందడి
-ఎవరు విన్నర్
-ఫ్యాన్స్ , మూవీ లవర్స్ కి మాత్రం మజా
సెల్యులాయిడ్ కి సరికొత్త ఊపు, ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat singh),ధురంధర్ 2(Dhurandhar 2)పోటాపోటీగా కాచుకొని కూర్చున్నాయి. దీంతో ప్రీమియర్స్ నుంచే ఆ రెండు సినిమాలు చూడాలనే ఆశావహుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అభిమానులు, మూవీ లవర్స్ అయితే క్షణమొక యుగంలాగా భావిస్తు సోమ, మంగళవారాలు ఫాస్ట్ గా గడిచిపోతే ఎంత బాగుండని అనుకుంటున్నారు. అదే టైంలో ఒక ఆసక్తికర చర్చ ఆ అందరి మధ్య జరుగుతుంది. మరి ఆ చర్చ ఏంటో చూద్దాం.
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ మొన్న రిలీజయ్యింది. ట్రైలర్ చూసిన తర్వాత మూవీ ఎంత ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ గా ఉండబోతుందో అర్దమవ్వడంతో పాటు విలన్స్ తో చేసే పోరాటం, యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. పైగా పవన్(Pawan kalyan)పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ధురంధర్ పార్ట్ 2 కూడా అంతే. ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ మూవీ. పార్ట్ 1 తోనే ఆ విషయం తెలిసినా, పార్ట్ 2 ట్రైలర్ తర్వాత పార్ట్ 1 ని మించిన యాక్షన్ సీక్వెన్స్ పక్కా అనే నమ్మకం వచ్చింది. రణవీర్ కూడా పోలీస్ కాప్. పైగా రెండు చిత్రాల కథనం పవన్, రణవీర్ ల వన్ మాన్ షోతో సాగనున్నాయి. మరి ఈ లెక్కన యాక్షన్ సీక్వెన్స్ లో పవన్, రణవీర్ సింగ్ ఏ విధంగా చేస్తారో తెలుసు. దీంతో తెలుగు నాట ఎవరి పెర్ ఫార్మెన్స్ బద్దలు కాబోతుందో అని అభిమానులు, మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు.
also read: Ustaad Bhagat Singh: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్.. బిజీ అవ్వడం ఖాయమా!
ధురంధర్ 2 కి వారం రోజుల క్రితమే ప్రీమియర్స్ కి సంబంధించి తెలుగు నాట బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి హిందీ, తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి స్టార్ట్ అవ్వగా ఇప్పటికే టికెట్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఉస్తాద్ బుకింగ్స్ కోసం అందరు వెయిటింగ్.







