Home

»

Latest News

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్!

Mar 17, 2026 3:54PM

'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాతల సంచలన నిర్ణయం
తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదు!
వసూళ్లపై ప్రభావం ఉంటుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్ర చిత్రం, నైజాం ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్తను అందించింది. 

పెద్ద హీరోల సినిమాలంటేనే టికెట్ ధరల పెంపుతో ప్రేక్షకుల జేబులు ఖాళీ అవుతున్న తరుణంలో, ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ సినిమాకు ఎలాంటి అదనపు టికెట్ రేట్ల పెంపు ఉండబోదని సమాచారం. 

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మొదటి వారం భారీగా రేట్లు పెంచడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. అయితే, సామాన్య ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని, సినిమాను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ఉస్తాద్ మేకర్స్ ఈ నిర్ణయానికి మొగ్గు చూపినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ టికెట్ ధరల నిర్ణయంపై పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. "టికెట్ రేట్లు పెంచడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి వెనుకాడతారు, కానీ ఇలా నార్మల్ రేట్లు ఉంచడం వల్ల సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది" అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' పై భారీ హైప్ ఉంది. ఆ హైప్ కి తగ్గట్టుగా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి, సాధారణ టికెట్ రేట్ల అంశం కలిసి వస్తే.. మరోసారి 'గబ్బర్ సింగ్' రిజల్ట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం, ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలో అడుగు పెట్టనుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Also Read: హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభుదేవా తనయుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com