Home

»

Latest News

Ustaad Bhagat singh: ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం.. మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి! 

Mar 05, 2026

 

-షాకింగ్ న్యూస్ వెల్లడి చేసిన మైత్రి 
-ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి 
-మార్చి నెల ఏం జరగబోతుంది


ప్రెజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. కోట్లు ఇచ్చినా ఆ ఆనందాన్ని కొనలేం. దీంతో మార్చి నెల పవన్, పవన్ ఫ్యాన్స్ మంత్ గా మారే అవకాశం ఉంది. అందుకు వేదికగా నిలిచింది ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఆ ఆనందకర వార్త ఏంటో చూసేద్దాం. 

ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat singh)ఈ నెల 26 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  కానీ పవర్ స్టార్ తుఫాన్ కాస్త ముందుగానే రాబోతోంది. ఏంటి నిజమేనా అని అనుకుంటున్నారా! అవును నిజమే.. అనుకున్న డేట్ కంటే ముందే మార్చి 19 న వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనుంది. ఈ మేరకు  తాజాగా ఉస్తాద్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్  వీకెండ్స్, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ వరకు వచ్చి మళ్ళీ వాయిదా పడి కొంచం వెనక్కి జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. పవన్ ప్రీవియస్ మూవీ హరిహర వీరమల్లు కూడా ఒక ఉదాహరణ. ఇలాంటి టైంలో ఉస్తాద్ ఇంకొంచం ముందుకు జరగడం అంటే అభిమానుల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక 'గబ్బర్ సింగ్' తరువాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్(Harish Shankar)కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ పై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు వచ్చిన ప్రతి కంటెంట్‌కి అద్భుతమైన స్పందన లభించింది. అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతు భారీ బజ్ సృష్టించాయి. దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్’సాంగ్స్ అయితే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. 

also read:  ప్రముఖ హీరోయిన్ కి అత్యాచార బెదిరింపులు.. ధురంధర్ గుర్తుంది కదా  

సిల్వర్ స్క్రీన్ కూడా భారీ ఆశలతో ఎదురుచూస్తున్న ఉస్తాద్ లో శ్రీలీల(Sreeleela),రాశి ఖన్నా(Raashii Khanna)హీరోయిన్స్  కాగా భారీ కాస్టింగ్ నే స్క్రీన్ పై మెరవనుంది. రీసెంట్ గా నేపథ్య సంగీతం బాధ్యతలని థమన్ కి అప్పగించారు. దేవిశ్రీ ప్రసాద్(Devi Sriprasad)బిజీగా ఉండటమే అందుకు కారణం. 

 

 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com