Home

»

Latest News

టాలీవుడ్ లో సొంత ఇల్లు లేని స్టార్ హీరోలు వీళ్ళే!

Sep 9, 2026 12:13PM

 

ఇల్లు కట్టుకొని మురిపోని వారంటూ ఉండరు. తమ జీవితం ధన్యమైపోయిందనుకునే వారికైతే లెక్కే ఉండదు.  కానీ  మన టాలీవుడ్ హీరోలలో కొంతమందికి... ఇప్పటివరకు తమకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదంటే మీరు నమ్ముతారా? "ఏంటి కామెడీ చేస్తున్నారా?" అని అనుకుంటున్నారేమో..ఇది అక్షరాలా నిజం! మనందరికీ తెలిసిన ఫేమస్ హీరోలు, కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే నటులు కూడా నేటికీ అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు.అసలు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? అంతటి స్టార్డమ్ ఉన్న నటులకు సొంత ఇల్లు లేకపోవడానికి కారణం ఏమిటి? 

ఈ లిస్ట్‌లో అందరికంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి... పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి గారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంటూ, ఎన్నో సక్సెస్ ఫుల్ విప్లవాత్మక సినిమాలు తీసిన ఈయన, నిజ జీవితంలో ఎంత సాధారణంగా ఉంటారో మనందరికీ తెలుసు. తలచుకుంటే హైదరాబాద్‌లోనే పెద్ద బంగ్లాలు కట్టేయగల సత్తా ఆయనకు ఉంది. కానీ, ఇప్పటివరకు ఆయన తనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోలేదు. నేటికీ అమీర్‌పేట్‌లోని ఒక సాధారణ హాస్టల్‌లోనే నివాసముంటూ, తన దగ్గర ఉన్న డబ్బంతా సినిమాల పైనే పెడుతున్నారు. సినిమానే తన జీవితం, సినిమానే తన ఇల్లు అని నమ్మిన మహోన్నత నటుడు.

ఇక కుర్ర హీరో రాజ్‌తరుణ్ కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు! అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, 'ఉయ్యాల జంపాల'తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. వరుస హిట్‌లతో కోట్లు సంపాదించిన రోజుల్లో చాలా ఆశగా ఒక మంచి కస్టమ్‌ హోమ్‌ను కొనుగోలు చేశాడు. కానీ పర్సనల్ లైఫ్‌లో వచ్చిన వివాదాల వల్ల, ఆ ఇంటిని తన మాజీ ప్రేయసి లావణ్యకు ఇచ్చేసి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసాడు. ప్రస్తుతం వరుస ప్లాపులు, రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన నిర్మాతల వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాజ్ తరుణ్... నేటికీ అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నాడు!

"జాతి రత్నాలు" సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మోస్ట్ వాంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించీ మీకు తెలుసా? యూట్యూబర్ స్థాయి నుండి ఒక్కో సినిమాకు 8 నుండి 10 కోట్ల రూపాయల దాకా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు ఈ యంగ్ స్టార్! కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే... ఇంత స్టార్డమ్ ఉన్నా నవీన్ పొలిశెట్టికి కూడా హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేదు. అలాగే యంగ్ హీరో సంతోష్ శోభన్ కూడా ఇప్పటివరకు సొంత ఇంటిని నిర్మించుకోలేదు.

 

 

Also read: రికార్డులే తరువాయి: ఇరుముడి సక్సెస్, ది ప్యారడైజ్ కి ప్లస్ కాబోతుందా! 


అయితే ఈ పరిస్థితి కేవలం యంగ్ హీరోలకే కాదు... మన టాలీవుడ్ లెజెండ్స్, పవర్ స్టార్స్‌ని కూడా వదల్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబు ప్రొడక్షన్‌లో తీవ్ర నష్టాల్లో ఉన్నప్పుడు... అన్నను ఆదుకోవడానికి తన సొంత ఇంటిని అమ్మేశాడు! దాదాపు రెండు మూడు ఏళ్ల పాటు దగ్గరలోని ఒక చిన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అద్దెకు ఉన్నాడు ! ఇక నిర్మాతల హీరోగా పేరుగాంచిన నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా భారీ బడ్జెట్ సినిమాల ప్లాపుల వల్ల తనకెంతో ఇష్టమైన 'పద్మాలయ స్టూడియోస్'తో పాటు తన సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది! మహేష్ బాబు ఇండస్ట్రీలో నిలదొక్కుకునే వరకు కృష్ణ గారు ఎన్నో ఆర్థిక కష్టాలని అనుభవించారు.

 

 

 

[Krishna, Pawan Kalyan, Naveen Polishetty, Raj Tharun,  R Narayana Murthy,Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com