TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

బోనీ కపూర్ ఇంట్లో మరో ఇద్దరికి కరోనా

May 22, 2020 3:53PM

అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అటు అభిమానుల్లో, ఇటు పరిశ్రమ వర్గాల్లో కాస్త ఆందోళనకర పరిస్థితి నెలకొంది. శ్రీదేవి భర్త బోనీ కపూర్ లోఖండ్ వాలా ఇంటిలో రెండు రోజుల క్రితం ఒక పనిమనిషి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరికి కరోనా సోకినట్టు తేలింది. టెస్టులు చేయగా రిజల్ట్స్ పాజిటివ్ అని వచ్చాయి. బోనీ కపూర్ ఇంట్లో తొలి కేసు బయటపడిన తర్వాత, ఇంట్లో అందరికీ టెస్టులు చేశారు. బోనీ సహా కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇతర కుటుంబ సభ్యులకు నెగెటివ్ అని వచ్చింది. సిబ్బందిలోనూ పలువురు నెగెటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇద్దరికి మాత్రం పాజిటివ్ అని రాగా, వాళ్లను ట్రీట్మెంట్ కోసం పంపారు. అదీ సంగతి!

హిందీ సినిమా ప్రముఖులు నివాసం ఉంటున్న ముంబై, మహరఃత్రలో కరోనా కరతాళ నృత్యం చేస్తోంది. మన దేశంలో కరోనా బారిన పడుతున్న ప్రజల్లో ఎక్కువశాతం మంది మహారాష్ట్ర నుండి కావడం గమనార్హం. హిందీ నటి జోయా మొరానీ, ఆమె తండ్రి-నిర్మాత కరీమ్ మొరానీ తదితరులు కరోనాబారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. 

google-ad-img