TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

"తుమ్మెద" మనసు లేని ప్రేమికుల కథ !

Jul 1, 2013 3:58PM

భాస్కర మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా నరేష్ అడపా- సరయు చిట్టాల సంయుక్త నిర్మిస్తున్న చిత్రం 'తుమ్మెద''మనసు లేని ప్రేమికుల కథ ' అనే ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ విభిన్న ప్రేమకథా చిత్రంలో ' ఆనంద్' ఫేమ్ రాజా,విజయ్,వర్ష, అక్షయ ముఖ్య తారాగణం.ఈ చిత్రం ద్వారా పలువురు ప్రముఖ దర్శకులు వద్ద పనిచేసిన కె.నారాయణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒక పాట మినహా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తుమ్మెద' ఆడియో త్వరలోనే విడుదల కానుంది.

 

Tummeda Movie, Tummeda Movie Story, Tummeda Movie News, Tummeda  Telugu movie Story

ఈ సంధర్భంగా చిత్ర దర్శకులు కె .నారాయణ మాట్లాడుతూ అసభ్యత - అశ్లీలతలకు తావులేని  సకుటుంబ సమేతంగా చూసి ఆనందించతగ్గ  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'తుమ్మెద ' మా హీరో రాజాకు  ఆనంద్ ఎంత పేరు తెచ్చిందో  తుమ్మెద అంతకు మించి మంచి పేరు తెస్తుంది.మా నిర్మాతలు  నరేష్ అడపా - సరయు చిట్టాల ఎంతో ప్యాషన్ తో, ఎక్కడ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతలుగా వారికి దర్శకుడిగా నాకు చక్కని శుభారంభాన్నిచ్చే చిత్రమిది . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.వచ్చే వారంలో  మిగిలి ఉన్న పాటను హీరో రాజా - వర్ష లపై చిత్రీకరించి  నెలాకరున ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. జీవా, రమణమూర్తి, ధనరాజ్ ,సుమన్ శెట్టి,చంటి ,అన్నపూర్ణమ్మ,డబ్బింగ్ జానకి, పావలా శ్యామల ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ : సత్య, కెమెరా: మహి, సంగీతం : రాబిన్, సాహిత్యం: వనమాలి, నిర్మాతలు : నరేష్ అడపా-సరయు  చిట్టాల, రచన - దర్శకత్వం: కె.నారాయణ 

google-ad-img