Home

»

Latest News

Tumbbad 2: ఇండియన్ సినిమా బెస్ట్ హారర్ థ్రిల్లర్ తుంబాడ్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది

Apr 29, 2026

 

భారతీయ చలనచిత్ర చరిత్రలో హారర్ థ్రిల్లర్ జోనర్ కి  కొత్త అర్థం చెప్పిన సినిమా 'తుంబాద్'(Tumbbad 2). 2018లో విడుదలవ్వగా  విజువల్ వండర్‌ తో పాటు కల్ట్ క్లాసిక్ హోదాని పొందింది.  సోహమ్ షా ముఖ్యమైన క్యారక్టర్ చేసిన  చిత్రం అప్పట్లో ఒక ప్రేక్షకులను ఒక సరికొత్త భయానక లోకంలోకి తీసుకెళ్లింది.. అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆశతో ఎదురుచూస్తు వస్తున్నారు. తాజాగా, అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ 'తుంబాద్ 2'  సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

తుంబాద్ 2 ని నిర్మిస్తున్న పెన్ మూవీస్ ఎక్స్ వేదికగా రిలీజ్ డేట్ ని ప్రకటించింది.  వచ్చే సంవత్సరం డిసెంబర్ 3 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మోదటి భాగం ఏ స్థాయిలో విజువల్స్ అందించిందో, అంతకు మించి అంతర్జాతీయ ప్రమాణాలతో సీక్వెల్‌ ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. 'పాపం మరియు దురాశ' అనే థీమ్ చుట్టూనే ఈసారి కూడా కథ తిరగనుంది. 'తుంబాద్ 2' అనౌన్స్‌మెంట్ రావడంతోనే హాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. భారతీయ సినిమాల్లో నిజమైన హారర్ అనుభూతిని ఇచ్చే సినిమా ఇదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొదటి భాగం ముగిసిన తీరు చూస్తే, సీక్వెల్‌లో వినాయక్ కొడుకు పాత్ర ఏం చేయబోతోంది? హస్తర్ మళ్లీ తిరిగి వస్తాడా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

Also read: Venakatesh: వెంకటేష్ పై దృశ్యం పాప ఎస్తేర్ అనిల్ సూపర్ కామెంట్స్  

ఏది ఏమైనా మొత్తానికి 'తుంబాద్ 2' ద్వారా భారతీయ బాక్సాఫీస్ వద్ద మరో విజువల్ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఇది ఒక గొప్ప ట్రీట్ అని చెప్పవచ్చు. సోహమ్ షా తన డ్రీమ్ ప్రాజెక్టును మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నారు. మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ను ఈ సీక్వెల్ కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి మరి. ఇటీవల 'తుంబాద్' ని  రీ రిలీజ్ చేసినప్పుడు  వచ్చిన రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అయ్యాయి. కొత్త సినిమాల కంటే ఎక్కువగా వసూళ్లని  రాబట్టింది.  మొదటి భాగాన్ని తెరకెక్కించిన 'అనీల్ రాహి బర్వె' నే దర్శకుడు.

   ?

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com