Home

»

Latest News

Toxic: నెగిటివ్ టాక్పై ఫ్యాన్స్ ఫైర్

Aug 26, 2026 1:01PM


ప్రెజెంట్ థియేటర్స్ లో యష్ జోరు టాక్సిక్ రూపంలో 12,000కు పైగా స్క్రీన్లలో   కొనసాగుతూ ఉంది. అయితే ఉదయం ఆరుగంటల ఆట నుంచే నుంచే సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్, డివైడ్ రివ్యూల ప్రచారం మొదలైంది. ముఖ్యంగా మూవీలో  హింస, రక్తపాతం, అడల్ట్ కంటెంట్ మోతాదుకి మించిపోయాయని, కథ నేరేషన్ నెమ్మదించిందంటూ కొందరు క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.  అయితే ఈ రకమైన నెగిటివ్ రివ్యూలపై యష్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ లేవనెత్తుతున్న మొదటి సూటి ప్రశ్న ఏమిటంటే— అసలు 'టాక్సిక్' చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)  'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ రికార్డుల్లోనే ఇది తీవ్రమైన హింస, చీకటి గ్యాంగ్‌స్టర్ ప్రపంచం, బ్రూటల్ యాక్షన్, నైతిక సంఘర్షణలతో కూడిన కథ అని స్పష్టంగా వర్గీకరించారు. 

పైగా ఎలాంటి కట్స్ లేకుండా కేవలం హెచ్చరికలతో మాత్రమే బోర్డు అనుమతి ఇచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి. ఇది పిల్లల కోసం లేదా ఫ్యామిలీ కోసం తీసిన క్యూట్ లవ్ స్టోరీ కాదు అని ముందే తెలిసినప్పుడు, థియేటర్ కి వచ్చి చూసి "సినిమాలో హింస ఎక్కువైంది, అందుకే నచ్చలేదు" అని మాట్లాడటంలో అర్థం ఉందా! డార్క్ గ్యాంగ్‌స్టర్ వరల్డ్‌లో రివేంజ్, విధేయత, హింస ప్రధానాంశాలుగా ఉంటాయి. గ్యాంగ్‌స్టర్ కథలో రక్తపాతం లేకుండా సెంటిమెంట్ చూపించమంటే అది దర్శకురాలి విజన్‌ను తప్పుపట్టడమే అవుతుంది.  మేకింగ్, రా పెర్ఫార్మెన్స్, విజువల్స్ పక్కనపెట్టి కేవలం 'వయెలెన్స్' ని టార్గెట్ చేస్తూ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం సరికాదని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సవాల్ విసురుతున్నారు. 


Also Read: టాక్సిక్ మూవీ హైలెట్స్  


ఇక టాక్సిక్  నెగిటివ్ ట్రోల్స్ నడుస్తున్నప్పటికీ ఒక్క బుక్‌మైషోలోనే గంటకు 52,000 పైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండ్ అవుతోంది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా స్టార్ చిరంజీవి కాకా ఫేమ్ కే. వెంకట్ నారాయణ  నిర్మించాడు.

TOxic, yash, Venkat K Narayana
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com