Home

»

Latest News

Toxic: టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

Aug 27, 2026 10:05AM

 

 -నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన టాక్సిక్ 
 -థియేటర్స్ దగ్గర అభిమానుల,ప్రేక్షకుల జాతర 
-దీంతో ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 


రాకింగ్ స్టార్ యష్ నిన్న వరల్డ్ వైడ్ గా 'టాక్సిక్' తో బాక్స్ ఆఫీస్ వద్ద అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో రిలీజైన అన్ని థియేటర్స్  హౌస్ ఫుల్ బోర్డుతో దర్శనమిచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 85 కోట్ల మార్కుని అందుకున్న టాక్సిక్  ఫస్ట్ డే కి సంబంధించి రికార్డు కలెక్షన్స్ ని సృష్టించింది.

తొలిరోజు అక్షరాలా 140.75 కోట్ల గ్రాస్ తో భారతీయ సినిమా చరిత్రలోనే మరో అతిపెద్ద ఓపెనింగ్స్  రాబట్టిన  మూవీగా నిలిచింది. దీంతో షారూఖ్ ఖాన్ ‘జవాన్’ 129.13 కోట్లు, ప్రభాస్ ‘ఆదిపురుష్’128.08 కోట్లు, రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ 116 కోట్లు రికార్డ్స్ కి సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్ అని చెప్పినట్లయింది. ఏరియాల వారీగా చూసుకుంటే  హిందీ బెల్ట్‌లో  దాదాపు 16,621 షోలలో ప్రదర్శించబడి సుమారు 52  కోట్ల గ్రాస్ ని రాబట్టి పెను సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు.

అదర్ లాంగ్వేజ్ చూసుకుంటే యష్ హోమ్ మార్కెట్  కన్నడలో 2,031 షోలతో 23.30 కోట్ల నెట్ కలెక్షన్లు రాగా, తెలుగు రాష్ట్రాల్లో 3,257 షోల ద్వారా 16.00 కోట్లు నెట్  తమిళనాడులో 5.50 కోట్లు, కేరళలో 1.30 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్ గురించి చెప్పుకుంటే 20 కోట్ల రికార్డు గ్రాస్ వసూలైంది. మరి రాబోయే రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ రాబట్టుతుందో చూడాలి.

Yash, Toxic, Geethu Mohandas, Kvn productions


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com