Home

»

Latest News

హాలీవుడ్ లో విషాదం: మీ అభిమాన నటుడు టామ్ స్కెరిట్ కన్నుమూత!

Oct 23, 2026 12:38PM

హాలీవుడ్ చిత్ర సీమలోఒక శకం ముగిసింది. 'టాప్ గన్', 'ఏలియన్' వంటి ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులని  గెలుచుకున్న లెజెండరీ నటుడు టామ్ స్కెరిట్ (Tom Skerritt)  కన్నుమూశారు.మొన్న 21న వృద్ధాప్య సహజ కారణాల వల్ల తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, పబ్లిసిస్ట్ అధికారికంగా వెల్లడించారు.


 ఈ అకస్మిక వార్త హాలీవుడ్ చిత్రసీమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో వెండితెరను ఏలిన ఒక గొప్ప నటుడి నిష్క్రమణ పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.   టామ్ స్కెరిట్ తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో అసాధారణమైన మైలురాళ్లను దాటారు. ఆయన కెరీర్‌లో ఏకంగా 150కి పైగా చలనచిత్రాలు మరియు టెలివిజన్ ప్రొడక్షన్స్‌లో (over 150 on-screen credits)  కీ రోల్స్  పోషించి తిరుగులేని ముద్ర వేశారు. 


ముఖ్యంగా 1979లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్ 'ఏలియన్' చిత్రంలో ఆయన పోషించిన కెప్టెన్ ఆల్డస్ డల్లాస్ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే 1986లో సూపర్ స్టార్ టామ్ క్రూజ్ సరసన ఆయన నటించిన 'టాప్ గన్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు ఆయనకంటూ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.కేవలం సినిమాలలోనే కాకుండా టెలివిజన్ రంగంలోనూ టామ్ స్కెరిట్ తన సత్తా చాటుకున్నారు. 'పికెట్ ఫెన్సెస్' (Picket Fences) టెలివిజన్ డ్రామాలో ఆయన చేసిన అత్యుత్తమ నటనకు గాను ప్రతిష్టాత్మకమైన ఎమ్మీ (Emmy) అవార్డును సొంతం చేసుకున్నారు. తన కెరీర్‌లో రెండుసార్లు ఎమ్మీ నామినేషన్లు దక్కించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. 'మాష్' (MAS*H) వంటి క్లాసిక్ ప్రాజెక్ట్‌లలోనూ ఆయన చేసిన అద్భుతమైన అభినయం టెలివిజన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకుని బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.   ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, టామ్ స్కెరిట్ తన భార్య జూలీ టోకాశికితో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు మొత్తం ఐదుగురు సంతానం - ఆండీ, ఎరిన్, మాట్, కోలిన్ మరియు ఎమికో ఉన్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఆయనకు పలువురు మనమలు (సారా, మాడిసన్, సన్నీ, లూయిసా, జార్జియా) అలాగే ఇద్దరు మునిమనమలు (మారిగోల్డ్, రవి) ఉన్నారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు.


ఇది కూడా చదవండి: 418 Movie Review Telugu: 418 మూవీ రివ్యూ 

 "ప్రపంచం టోమ్‌ని ఒక గొప్ప నటుడిగా గుర్తిస్తే, మేము మాత్రం ఆయనలోని హాస్య చతురత, జిజ్ఞాస, విజ్ఞత మరియు మా జీవితాల్లోకి ఆయన తెచ్చిన అనంతమైన ప్రేమను చూశాము" అంటూ వారు పేర్కొన్నారు.సృజనాత్మకత, కథ చెప్పే కళ, సైనిక అనుభవజ్ఞుల సంక్షేమం మరియు తోటి వారికి సహాయం చేయడం పట్ల టామ్ స్కెరిట్ ఎప్పుడూ మక్కువ చూపేవారని కుటుంబీకులు గుర్తు చేసుకున్నారు. ఆయన వదిలి వెళ్లిన కళాఖండాలు, నటనలోని విలువలు రాబోయే తరాల నటులకు ఎప్పటికీ మార్గదర్శకం అవుతాయి. 93 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఆయన కనబరిచిన అంకితభావం, కళాసేవ చిరస్మరణీయమైనవి. టామ్ స్కెరిట్ భౌతికకాయానికి సంబంధించిన స్మారక కార్యక్రమ వివరాలను త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడించనున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. అయన వయసు 93 సంవత్సరాలు. డేట్ ఆఫ్ బర్త్ 1933 ఆగస్టు 25 .

  

[Tom Skerritt Passes Away, Tom Skerritt dead, Tom Skerritt actor, Top Gun star Tom Skerritt, Alien movie actor, Tom Skerritt age 93, Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com