
టాలీవుడ్‌లో తండ్రి కూతుళ్ల బంధాన్ని వెండితెరపై చూపించడం కొత్తేమీ కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి నేటి డిజిటల్ యుగం వరకు ఎన్నో సినిమాలు ఈ ఎమోషనల్ సెంటిమెంట్‌తో వచ్చి సూపర్ హిట్లుగా నిలిచాయి. మధ్యలో కొంతకాలం ఈ ట్రెండ్ కాస్త తగ్గినట్లు అనిపించినా, ఇప్పుడు మళ్లీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫార్ములాగా రూపాంతరం చెందింది. దానికి తాజా ఉదాహరణే 'ఇరుముడి'.
ఈ సినిమాలో త్రినాథ్ - మణమ్మల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ, బేబి నక్షత్రల అద్భుతమైన నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఎంతలా అంటే.. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 250 కోట్ల వసూళ్లు సాధించి రికార్డులను తిరగరాసింది.
గతంలో వచ్చిన అనేక చిత్రాలు కూడా ఇదే ఎమోషన్‌తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాయి. 'హాయ్ నాన్న' సినిమాలో చిన్నారి మహిని కాపాడుకోవాలని తపించే తండ్రి పాత్రలో నాని ఒదిగిపోయిన తీరు అందరినీ కంటితడి పెట్టించింది. 2023లో వచ్చిన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. ఇక అదే ఏడాది వచ్చిన 'భగవంత్ కేసరి'లో పెంచుకున్న కూతురిని ఆర్మీ ఆఫీసర్‌గా చూడాలనే లక్ష్యం కోసం శ్రమించే పవర్ ఫుల్ ఫాదర్‌గా నటసింహం నందమూరి బాలకృష్ణ మెప్పించారు.

గతంలో రవితేజతో దర్శకధీరుడు రాజమౌళి తీసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'విక్రమార్కుడు' కూడా డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్‌తో ముడిపడిన కథే. అలాగే వెంకటేష్ నటించిన థ్రిల్లర్ 'దృశ్యం' కూడా కూతురి కోసం ఒక తండ్రి పడే తపన, ఆరాటం చుట్టూనే తిరుగుతుంది. కూతురు వల్ల జరిగిన తప్పును కప్పిపుచ్చేందుకు ఒక తండ్రి చేసే పోరాటం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు అందరి దృష్టి నెక్స్ట్ రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'కాకా'పై పడింది. ఈ సినిమాలో కూడా డాటర్ అండ్ ఫాదర్ బాండింగ్‌ను ఎమోషనల్‌గా చూపించబోతున్నారట. గతంలో చిరంజీవి తండ్రి-కూతురు సెంటిమెంట్‌తో చేసిన 'డాడీ' చిత్రం ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మరి రాబోయే 'కాకా' సినిమాతో మెగాస్టార్ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తారేమో చూడాలి.
[Father Daughter Sentiment, Telugu Movies, Ravi Teja, Irumudi Movie, Kaaka Movie, Megastar Chiranjeevi, Nandamuri Balakrishna, Telugu Film News]





