Home

»

Latest News

తెలుగు సినిమా మత్తు వదలదా...?

Jul 24, 2011

తెలుగు సినిమా మత్తు వదలదా...? అని ప్రేక్షకులకు ఒక ప్రశ్న చిరాకు కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే ఆ మధ్య ఒక చిన్ననిర్మాత వెంకటేశ్వరరావు, హేమంత్ ఆ తర్వాత రవితేజ సోదరులు రఘునాథ్ రాజు, భరత్ రాజు, ఇటీవల నటుడు వరుణ్ సందేశ్, అభిషేక్, నిర్మాత రవి ఉప్పలపాటి ఇలా ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న పేర్లను చూస్తుంటే తెలుగు సినిమా మత్తు వదలదా...? అని ప్రేక్షకులనుకోవటంలో తప్పేముంది...

హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ ఎ.కె.ఖాన్ మాటల ప్రకారం 64 మంది సినీ సెలబ్రిటీలకు కొకైన్ వాడే అలవాటుందని సమాచారం. కానీ వాళ్ళెవరన్నది మత్రం బయటపెట్టరు. బయటపెడితే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నెల నెలా వచ్చే మామూళ్ళు పోతాయేమో పాపం. ఇది ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకి "నేను తెలుగు సినీ పరిశ్రమలో పనిచేస్తాను" అని చెప్పుకోవాలంటే సిగ్గుపడే ప్రమాదముంది. ఇప్పటికైనా సినీ పరిశ్రమ ఈ డ్రగ్స్ మత్తు ఊబిలోనుంచి బయటపడేదెప్పుడో ఆ దేవుడికే తెలియాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com