TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

'దసరా' ఔట్.. త్వరలోనే 'గీత గోవిందం' కూడా...

Apr 14, 2024 3:20PM

బాక్సాఫీస్ దగ్గర 'టిల్లు స్క్వేర్' జోరు కొనసాగుతూనే ఉంది. 16 రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ.65 కోట్ల షేర్ షేర్ రాబట్టిన ఈ చిత్రం రూ.70 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది. వసూళ్ల పరంగా ఇప్పటికే 'దసరా'ను దాటేసిన టిల్లు స్క్వేర్.. త్వరలోనే 'గీత గోవిందం'ను దాటేసే అవకాశముంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ యంగ్ స్టార్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు నాని, విజయ్ దేవరకొండ. నాని కెరీర్ లో రూ.63 కోట్ల షేర్ తో 'దసరా' టాప్ లో ఉండగా, విజయ్ కెరీర్ లో రూ.70 కోట్ల షేర్ తో 'గీత గోవిందం' టాప్ లో ఉంది. అయితే ఇప్పటికే రూ.65 కోట్ల షేర్ షేర్ రాబట్టి 'దసరా'ను బీట్ చేసిన 'టిల్లు స్క్వేర్'.. మరికొద్ది రోజుల్లో 'గీత గోవిందం'ను బీట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

google-ad-img