TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'థగ్ లైఫ్' టీజర్!

Nov 7, 2024 11:06AM

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'థగ్ లైఫ్'. రాజ్ కమల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శింబు, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. (Thug Life Release Date)

'థగ్ లైఫ్' సినిమా జూన్ 5, 2025 న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుపుతూ తాజాగా రిలీజ్ డేట్ టీజర్ ని విడుదల చేశారు. 40 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ పవర్ ఫుల్ గా ఉంది. అదిరిపోయే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కమల్, శింబు పాత్రలను చూపించిన తీరు బాగుంది. టీజర్ చూస్తుంటే.. కమల్, శింబు, మణిరత్నం కలిసి సిల్వర్ స్క్రీన్ పై యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న 'థగ్ లైఫ్' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రవి కె. చంద్రన్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

google-ad-img