Home

»

Latest News

గరివిడి లక్ష్మి: మంచి బయోపిక్ మిస్ చేసుకున్న ముగ్గురు స్టార్ హీరోయిన్స్.!

Oct 23, 2026 1:30PM

ఒక బయోపిక్ కోసం స్టార్ హీరోయిన్లను సంప్రదించడం.. చివరకు ఆ పాత్ర మరో నటికి దక్కడం.. సాధారణంగా జరిగేదే. ఇప్పుడు ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ విషయంలోనూ ఇదే జరిగింది. మొదట సాయి పల్లవి, నివేదా థామస్, నిత్యా మీనన్‌లకు ఈ కథను వినిపించినట్లు దర్శకుడు గౌరి నాయుడు జమ్ము వెల్లడించారు.

ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి, ‘గరివిడి లక్ష్మి’గా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారన్నది ఈ బయోపిక్‌లో ప్రధాన అంశం. ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ పాత్ర కోసం మొదట సాయి పల్లవిని సంప్రదించారట. ఆ తర్వాత నివేదా థామస్, నిత్యా మీనన్‌లకు కూడా కథ వెళ్లినట్లు దర్శకుడు ఇటీవల మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో రివీల్ చేశారు.

కొన్ని కారణాల వల్ల ఆ హీరోయిన్స్ ఈ ప్రాజెక్టులో భాగం కాలేకపోయారని దర్శకుడు తెలిపారు. చివరకు ఈ కీలక పాత్రను ఆనంది అంగీకరించారు. గరివిడి లక్ష్మి సినిమాలో ఆనంది పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలో ఆనందిని తప్ప మరో నటిని ఊహించుకోలేకపోతున్నామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

రాగ్ మయూర్, నరేశ్, రాశి, ఎల్‌బీ శ్రీరామ్ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ప్రముఖ కళాకారిణి జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావడం ఒకవైపు ఆసక్తి రేపితే, ఈ పాత్ర కోసం పలువురు ప్రముఖ హీరోయిన్లను సంప్రదించారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: టాలీవుడ్‌లో భారీ మైథలాజికల్ మూవీ.. శ్రీవిష్ణుతో ‘రంగబలి’ డైరెక్టర్ బిగ్ స్కెచ్.!

 

 

[Three Heroines Missed Garividi Lakshmi, Garividi Lakshmi Biopic, Garividi Lakshmi Movie, Sai Pallavi, Nivetha Thomas, Nithya Menen, Anandhi, Gowri Naidu Jammu, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com