TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

పృథ్వీ కష్టానికి ప్రతి ఫలం ఇదే.. షాక్ ఇస్తున్న కలెక్షన్స్  

Apr 1, 2024 12:25PM

రీసెంట్ గా వరల్డ్ వైడ్ సినీ ప్రేమికుల ముందుకు వచ్చిన మూవీ ది గోట్ లైఫ్ (The goat life) తెలుగులో ఆడు జీవితం పేరుతో విడుదల అయ్యింది. మలయాళ అగ్ర హీరో ప్లస్ అగ్ర దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్(prithviraj sukumaran) ఇందులో హీరోగా నటించాడు. నటించాడు అనే కంటే జీవించాడని చెప్పవచ్చు. ఒక సినిమా కోసం ఇంతగా కష్టపడతారా అని ప్రేక్షకులే కాకుండా సినిమా వాళ్ళు కూడా అనుకునేలా కూడా  చేసాడు. తాజాగా గోట్ లైఫ్ కొన్ని సంచలనాలకి కేంద్ర బిందువుగా నిలిచింది
  
ఓవర్ సీస్ లో మలయాళ చిత్రాల ప్రభావం కొంచం తక్కువగానే ఉంటుంది. సినిమా బాగుంటే నెమ్మదిగా పికప్ అయ్యి ఓ  మోస్తరు కలెక్షన్స్ ని సాధిస్తాయి. అలాంటిది ఇప్పుడు గోట్ లైఫ్ రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తుంది. పైగా అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల మార్కును దాటిన ఫస్ట్ మలయాళ మూవీగా కూడా  నిలిచింది. ఇంతకుముందు మోహన్‌లాల్ నటించిన లూసిఫర్‌ పై ఈ రికార్డ్ ఉండేది. పృథ్వీ నే  లూసిఫర్‌ కి దర్శకుడు కావడం గమనార్హం. నిన్న వీకెండ్ తో  కలుపుకొని  వరల్డ్ వైడ్ గా మొత్తం 65 కోట్ల గ్రాస్  కలెక్షన్స్ ని  రాబట్టింది. ఇవేం ఆషా మాషి కలెక్షన్స్ కాదు. గోట్ లైఫ్ లో ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు. ఎలాంటి కమర్షియల్ హంగులు ఉండవు. అలాంటిది పృథ్వీ వన్ మాన్ షో కి  ప్రపంచ సినీ బాక్స్ ఆఫీస్  సెల్యూట్ కొడుతుందని చెప్పవచ్చు.

పరాయి దేశంలో చిక్కుకు పోయి నరకయాతన అనుభవించే నజీబ్ క్యారక్టర్ లో పృథ్వీ  జీవించారని చెప్పవచ్చు. ఆ క్యారక్టర్ కోసం  31 కిలోలు బరువు కూడా తగ్గాడు. ప్రతి సీన్‌లోను నాచురల్ గా నటించి  ప్రేక్షకుల చేత కన్నీళ్లు కూడా  తెప్పించాడు. కమల్ హాసన్,మణిరత్నం లతో  సహా చాలా మంది ఇండియన్ యాక్టర్స్ పృథ్వీ నటనని ప్రశంసిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే నేషనల్ అవార్డ్ వస్తుందనే  నమ్మకంతో ఉన్నారు.  తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ ని  రాబడుతుంది. బ్లెస్సీ(blessy)దర్శకత్వంతో పాటు ఒక ముఖ్య పాత్ర పోషించాడు. 2008 లోప్రచురితమైన మలయాళ నవల ఆడుజీవితం ఆధారంగా గోట్ లైఫ్ తెరకెక్కింది. 

 

google-ad-img