Home

»

Latest News

‘తండేల్‌’ను టార్గెట్‌ చేసిన APS RTC.. మరోసారి బస్‌లో సినిమా ప్రదర్శన!

Feb 12, 2025

సినిమా ఇండస్ట్రీలో పైరసీ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. సినిమా రిలీజ్‌ అయిన రోజు మొదటి షో పూర్తయిన వెంటనే పలు వెబ్‌సైట్స్‌లో సినిమా అందుబాటులోకి వస్తోంది. కొన్ని వెబ్‌సైట్స్‌లో హెచ్‌డి ప్రింట్‌ లభిస్తోంది. ఇలాంటి పైరసీ వెబ్‌సైట్స్‌ను అరికట్టేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. పైరసీకి పాల్పడుతున్న ఎంతోమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ పైరసీని మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. తాజాగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్‌’ సినిమా పైరసీ బారిన పడిరది. పైరసీ ప్రింట్లు సాధారణంగా వెబ్‌సైట్స్‌లో మొబైల్స్‌లో సర్క్యులేట్‌ అవుతూ ఉంటాయి. కానీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఈ సినిమా బహిరంగంగా ప్రదర్శించడం అనేది సంచలనంగా మారింది. 

ఎపీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఓ బస్సులో ఇటీవల ‘తండేల్‌’ చిత్రాన్ని ప్రదర్శించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అల్లు అరవింద్‌, బన్సీవాసు మీడియా ముందుకొచ్చి పైరసీదారులకు వార్నింగ్‌ ఇచ్చారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతమందిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు, ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కలుస్తామని తెలిపారు. అయితే దానికి సంబంధించిన కార్యాచరణ పూర్తి కాకముందే ఆర్టీసీ మరో ఘాతుకానికి పాల్పడిరది. వైజాగ్‌ నుంచి శ్రీకాకుళం వెళుతున్న బస్సులో తండేల్‌ సినిమా ప్రదర్శనకు సంబంధించిన వీడియోను, ఆ బస్‌ నెంబర్‌ను, బస్‌ టికెట్‌ను షేర్‌ చేశారు.

దీనిపై బన్ని వాస్‌ స్పందిస్తూ ‘ఎంతోమంది క్రియేటర్స్‌ కష్టానికి ఫలితమే సినిమా. పైరసీ ద్వారా వారి గౌరవాన్ని భంగపరుస్తున్నారు. దీని వల్ల చిత్ర పరిశ్రమకు ఎంతో నష్టం జరుగుతుంది. కొందరు కావాలని పైరసీ చేస్తున్నారు. మరికొందరు సరైన అవగాహన లేక పైరసీ చేస్తున్నారు. ఎలా చేసినా తప్పే. ముఖ్యంగా ఈ విషయంలో యూత్‌ ఇన్‌వాల్వ్‌ అవ్వకండి. మా సినిమాకి సంబంధించిన ఒక్క క్లిప్‌ ప్లే చేసినా ట్రాక్‌ చేసి పట్టుకుంటాం’ అని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఎపికి చెందిన రెండు బస్సుల్లో తండేల్‌ సినిమా పైరసీ ప్రింట్‌ను ప్రదర్శించడం పట్ల ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ళ నారాయణరావు విచారణకు ఆదేశించారు. తమ సంస్థలో జరిగిన ఈ తప్పిదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com