TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

గేమ్ ఛేంజర్ పై తమన్ కీలక వ్యాఖ్యలు.. మస్కట్ లో చరణ్ 

May 23, 2024 5:35PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా  గేమ్ చేంజర్ నుంచి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇక అప్పటినుంచి మూవీ గురించి  ఎలాంటి అప్ డేట్ లేదు. ఒక పక్క ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ కల్కి, అల్లు అర్జున్  పుష్ప 2 లు సినీ మార్కెట్ లో సందడి చేస్తున్నాయి.  దీంతో మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ విషయంలో డల్ గా ఉన్నారు. ఈ టైం లో తమన్ చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశమయ్యాయి 

గేమ్ ఛేంజర్ కి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆల్రెడీ  ఫస్ట్ సాంగ్  జరగండి సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.  తాజాగా ఆయన  గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతు  మూవీ లోని  సాంగ్స్ అన్ని సూపర్ గా ఉంటాయి. అలాగే మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్.ప్రతి అంశం హైలైట్ గా ఉంటుంది. శంకర్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత తన మార్క్ కమర్షియల్ తో వస్తున్నారు. ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కి పెద్ద ఫీస్ట్ రాబోతుంది. ఇది నా  ప్రామిస్  అంటు ట్విట్టర్ వేదికగా చెప్పాడు

 

ఇప్పుడు  తమన్ చెప్పిన ఈ మాటలతో  మెగా ఫ్యాన్స్ లో సరికొత్త  జోష్ వచ్చింది. ఎందుకంటే శంకర్  ఓల్డ్ మూవీస్  జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు,సినిమాలు ఎంతగా ఘన విజయం సాధించాయో అందరకి తెలిసిందే. విజయం సాధించడమే కాదు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులు  సృష్టించాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లో చరణ్ సరసన కియారా అద్వానీ జత కడుతుండగా  అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై  దిల్ రాజు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఆయనకిది 50 వ సినిమా. చరణ్ ప్రస్తుతం తన వైఫ్ ఉపాసన, కూతురు క్లీంకార తో కలిసి మస్కట్ లో ఉన్నాడు

 

google-ad-img