TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

13న ‘తెలుగువన్’ షార్ట్ ఫిలిం వర్క్‌షాప్

Sep 11, 2014 2:52PM

 Teluguone Shortfilm Workshop, Workshop on Shortfilm, Teluguone Workshops, telguone short movies

ఇప్పుడు షార్ట్ ఫిలింల యుగం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ రావడానికి ‘తెలుగువన్’ తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఉత్సాహవంతులు, ప్రతిభావంతులైన షార్ట్ ఫిలిం మేకర్లని ప్రోత్సహించడంతోపాటు, షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లను నిర్వహిస్తూ ప్రతినెలా ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన వారికి నగదు బహుమతులు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తోంది. అలాగే షార్ట్ ఫిలిం మేకింగ్ మీద ఔత్సాహికులకు అవగాహన పెంచే కార్యక్రమాలను కూడా ‘తెలుగువన్’ విజయవంతంగా నిర్వహిస్తోంది.

ఇటీవల ప్రముఖ తెలుగు రచయిత, దర్శకుడు కోన వెంకట్‌ని ‘తెలుగువన్’  తాను నిర్వహించిన షార్ట్ ఫిలిమ్స్ వర్క్ షాప్‌కి గెస్ట్‌గా ఆహ్వానించింది. ఆయన ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్లకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇప్పుడు ‘కీప్ ఇట్ షార్ట్’ పేరుతో మరో షార్ట్ ఫిలిం వర్క్ షాప్‌ని ‘తెలుగువన్’ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వున్న లమకాన్‌లో ఈ వర్క్ షాప్ జరుగనుంది. మధ్యాహ్నం 2  గంటల నుంచి 4 గంటలకు వరకు వర్క్‌షాప్ జరుగుతుంది. ఈ వర్క్‌షాప్‌లో ప్రముఖ తెలుగు నటుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ అతిథిగా పాల్గొంటారు. ఔత్సాహికులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు సినిమా, షార్ట్ ఫిలిం మేకింగ్‌తో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకుంటారు. ఈ చక్కటి వర్క్‌షాప్‌కి ‘తెలుగువన్’ అందరికీ ఆహ్వానం పలుకుతోంది. పేరు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 040-23757192, 23757193, (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు). ఈ మెయిల్:  ivramadevi@objectinfo.com.
 

google-ad-img