TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

‘పోకిరి’ నుంచి ‘నా గుండె జారిపోయిందే..’ సాంగ్‌ లాంచ్‌

Dec 31, 2024 5:06PM

వరుణ్‌రాజ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పోకిరి’. ఈ సినిమాలో మమత హీరోయిన్‌ కాగా వికాస్‌ దర్శకులు. వరుణ్‌రాజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని మొదటి పాటని విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు.
హీరోయిన్‌ మమత మాట్లాడుతూ ‘ఇది నా ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌. డైరెక్టర్‌ వికాస్‌గారికి, వరుణ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీ గుర్తొస్తుంది. ఇదొక మంచి సినిమా. అందరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
డైరెక్టర్‌ వికాస్‌గారు మాట్లాడుతూ ‘మేము స్టోరీ లైన్‌ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్‌ అనుకున్నాం. వేరే టైటిల్స్‌ పెడదాం అనుకున్నా పోకిరినే సెట్‌ అవుతుందని ఈ టైటిల్‌ సెట్‌ చేసుకున్నాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్‌ తీసుకున్నాం. ఈ సినిమా బాగా హిట్‌ అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు. 
హీరో మరియు నిర్మాత వరుణ్‌రాజ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో గట్టిగా హిట్‌ కొడతాం. ఈ సినిమా హిట్‌ అవుతుందని మాకు కాన్ఫిడెన్స్‌ ఉంది. నేను పవన్‌ కళ్యాణ్‌గారి అభిమానిని. నేను చిరంజీవిగారికి మహేష్‌బాబుగారికి కూడా అంతే అభిమానిని. ఈ సినిమా టైటిల్‌లోనే దమ్ముంది. పోకిరికి ఓనర్‌ మహేష్‌బాబుగారే. మేమంతా అభిమానులం అంతే’ అన్నారు. 
మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడటం కన్నా నా మ్యూజిక్‌ మాట్లాడితే బాగుంటుంది అని ఆశిస్తున్నాను’ అన్నారు.

google-ad-img