TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

చిమటా ప్రొడక్షన్స్‌ ‘నేను-కీర్తన’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల!

Apr 4, 2024 4:14PM

చిమటా ప్రొడక్షన్స్‌ పతాకంపై చిమటా రమేష్‌ బాబు (సి.హెచ్‌.ఆర్‌)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్‌బాబు - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్‌.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన ‘నేను-కీర్తన’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ అండ్‌ టీజర్‌ విడుదల వేడుక హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌ లో ఘనంగా జరిగింది. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, ‘రజాకర్‌’ దర్శకుడు యాటా సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

‘నేను-కీర్తన’ చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించానని, ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్‌ చిత్రంగా మలచిన ‘నేను-కీర్తన’ చిత్రం కచ్చితంగా చేరుతుందని, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు, ఆరు రోప్‌ ఫైట్స్‌ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిమటా రమేష్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 

‘నేను-కీర్తన’ చిత్రంలో నటించడం చాలా సంతృప్తినిచ్చిందని సీనియర్‌ నటులు విజయ్‌ రంగరాజు, జబర్దస్త్‌ అప్పారావు పేర్కొన్నారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్‌ రిషిత కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎల్‌.రాజా, రాజ్‌ కుమార్‌, ఎర్రచీర సుమన్‌ బాబు తదితరులు పాల్గొని ‘నేను - కీర్తన’ ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.

google-ad-img