TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

గేమ్‌ స్టార్ట్‌ చేసాం..మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి : గీతానంద్‌

Jan 20, 2024 3:36PM

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం  ‘గేమ్‌ ఆన్‌’. సీనియర్‌ నటులు మధుబాల, ఆదిత్య మీనన్‌ శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్‌ అండ్‌  గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌  దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.  

ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి  మాట్లాడుతూ ‘మంచి కథతో ఈ సినిమాను స్టార్ట్‌ చేసాం. ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసేలా సినిమా ఉంటుంది. నవాబ్‌ గ్యాంగ్స్‌ అద్భుతమైన పాటలు ఇచ్చారు అవి అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి’ అని చెప్పారు. 

దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ ‘కమర్షియల్‌ స్క్రిప్ట్‌ని రా అండ్‌ రస్టిక్‌ గా చిత్రీకరించాను. పూరి జగన్నాథ్‌ ఫ్యాన్‌గా ఈ సినిమాను డైరెక్ట్‌ చేశాను.
ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి రియల్‌ టైమ్‌ సైకలాజికల్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్‌ ఆన్‌’ సినిమా తెరకెక్కింది’ అని చెప్పారు.

గీతానంద్‌ మాట్లాడుతూ ‘ట్రైలర్‌ లో చూసింది 10% మాత్రమే.  ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్‌ చేశాం. మంచి కాన్సెప్ట్‌ రాసుకుని దానికి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడిరచాం. ఇదొక హై ఆక్టేన్‌ యాక్షన్‌ డ్రామా. గేమ్‌ స్టార్ట్‌ చేసాం. మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి’ అన్నారు.     
 

google-ad-img