TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్‌ సాధించిన ‘గామి’!

Mar 9, 2024 11:57AM

విశ్వక్‌సేన్‌ ప్రధాన పాత్రలో విద్యాధర్‌ దర్శకత్వంలో రూపొంది డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ ‘గామి’. మార్చి 8న విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ వరల్డ్‌వైడ్‌గా రూ.9.7 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసింది. కొత్త తరహా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ కలెక్షన్స్‌తో మరోసారి ప్రూవ్‌ అయింది.  ఇండియాలోనే కాదు, యు.ఎస్‌.లో కూడా మంచి ఓపెనింగ్స్‌ రాట్టుకుందీ సినిమా. 

టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ సినిమా విజువల్‌గా ఎంతో గ్రాండియర్‌ని సొంతం చేసుకుంది. హిమాలయాల్లోని రేర్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక విజువల్‌ ట్రీట్‌గా అనిపిస్తాయి. ఇప్పటి వరకు విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన సినిమాల్లోకెల్లా ‘గామి’ డెఫినెట్‌గా కొత్త తరహా సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాకి విద్యాధర్‌ టేకింగ్‌, నరేష్‌ కుమారన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, విశ్వనాథరెడ్డి సినిమాటోగ్రఫీ ప్రాణం పోసాయని చెప్పొచ్చు. రిలీజ్‌కి ముందే సినిమాకి బాగా హైప్‌ క్రియేట్‌ చేశారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి సైతం సినిమా యూనిట్‌ని అభినందించడంతో భారీ ఓపెనింగ్స్‌ సాధించింది ‘గామి’ 

google-ad-img