TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

కాస్టింగ్ కౌచ్ దాటుకుని వస్తే... పెళ్లికి కండీషన్స్ పెడతారా?

Jun 15, 2020 1:53PM

తెలుగమ్మాయి తేజస్వి మదివాడ కాస్టింగ్ కౌచ్ (సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి పడకగదిలో సుఖాలు ఇవ్వాలని కొందరు కోరే ప్రక్రియ) గురించి నోరు విప్పింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ ఉందని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించింది. తాను కాస్టింగ్ కౌచ్ దాటుకుని ఇంతదూరం వచ్చానని తేజస్వి స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రేమించిన అబ్బాయితో ఎందుకు పెళ్లికి నిరాకరించిందీ ఆమె చెప్పుకొచ్చింది. 

"అతడి (పెళ్లి చేసుకుందామనుకున్న వ్యక్తి) ఫ్యామిలీ యాక్టింగ్‌కి నేను దూరం కావాలని కోరుకుంది. సోషల్ మీడియాలో ఫొటోలు, వీలైతే సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేయమన్నారు. సర్‌ప్రైజ్ అయినా పెళ్లి తర్వాత కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాను. ఇంకా కండీషన్స్ పెట్టారు. కొన్ని రోజుల తర్వాత నా ఐడెంటిటీ కోల్పోతున్నట్టు అనిపించింది. నా త్యాగాలకు విలువ లేకుండా పోయిందనిపించింది. నన్ను నన్నుగా వాళ్లు యాక్సెప్ట్ చేయడం లేదు. కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని కాబట్టి... నా క్యారెక్టర్ మీద ఓ అభిప్రాయానికి రాకూడదు. కాస్టింగ్ కౌచ్ దాటుకుని ఇంతదూరం వచ్చి, నాకు నేనుగా నిలబడ్డాను. నా కష్టాన్ని గుర్తించడం లేదనీ, గౌరవం ఇవ్వడం లేదని అనిపించింది. అందుకే, పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నా" అని తేజస్వి మదివాడ పేర్కొంది. 

ఇంతకీ, తేజస్వి ఎవరిని పెళ్లి చేసుకుందామని అనుకొందో మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'కమిట్మెంట్' సినిమాలో సన్నివేశాలకు, తన జీవితానికి చాలా సారూప్యతలు ఉన్నట్టు తేజస్వి తెలిపింది.

 

google-ad-img