Home

»

Latest News

తేజ సజ్జ పెళ్లి: ప్రేమ వివాహమా?.. క్లారిటీ ఇచ్చిన హీరో.!

Oct 23, 2026 10:53AM

‘హనుమాన్’, ‘మిరాయ్’ సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఆయన వివాహం గురించి గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తేజ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు.. తనది ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమని కూడా స్పష్టం చేశారు.

తేజ సజ్జ వివాహ వేడుకలు నవంబర్‌లో నిశ్చితార్థంతో ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత డిసెంబర్‌లో ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వివాహం జరగనుంది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం కంటే కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రశాంతంగా జరుపుకోవాలని తేజ భావిస్తున్నారట. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు, ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

తేజ సజ్జ కాబోయే భార్యకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఆమె ఐటీ రంగంలో పని చేస్తున్నట్లు సమాచారం.

తేజ సజ్జ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉంచుతుంటారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ అదే విధానాన్ని కొనసాగించాలనుకుంటున్నారట. అందుకే కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వివాహ వేడుక జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన తేజ.. ‘జాంబీ రెడ్డి’, ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కెరీర్‌లో దూసుకెళ్తున్న సమయంలోనే వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. 

ఇది కూడా చదవండి: టాలీవుడ్‌లోకి ప్రభుదేవా రీఎంట్రీ.. ఆ స్టార్ హీరోతో దర్శకుడిగా సినిమా.!

 

 

 

[Teja Sajja Wedding December, Teja Sajja Wedding Udaipur, HanuMan Hero Marriage, Teja Sajja Marriage, HanuMan Actor Wedding, Teja Sajja Movies, Teja Sajja, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com