
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, ఏఎస్ రవికుమార్ చౌదరి కాంబోలో వచ్చిన 'వీరభద్రుడు' తో తెలుగు ప్రేక్షకులని పలకరించిన నార్త్ బ్యూటీ తనుశ్రీ దత్త. బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో మంచి పెర్ఫార్మ్ తో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. రీసెంట్ గా నానాపటేకర్ పై కీలక వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ స్టేజ్ లో ఉంది
నానాపటేకర్ మరణం తర్వాత ఆమె 'ఎవిల్ డెడ్' అని పోస్ట్ చేసింది. ఆ మాటలు వివాదాస్పద మవుతుండటతో తాజాగా ఆమె ఒక వీడియో రిలీజ్ చేసారు. మీటూ ఉద్యమం తర్వాత తాను ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొన్నానో ప్రజలకు పూర్తిగా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు తాను వారానికి ఐదు రోజులు ఎంతో సంతోషంగా పని చేస్తూ ప్రపంచమంతా ఎలాంటి భయం లేకుండా తిరిగేదానని, అప్పట్లో తనకు ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు గానీ భద్రతా సమస్యలు గానీ ఉండేవి కాదని గుర్తుచేసుకున్నారు.
కాని మీటూ ఉద్యమం తర్వాత బహిరంగంగా చెప్పడానికి కూడా వీలు లేని ఎన్నో అవాంఛనీయ సంఘటనలు తన విషయంలో జరిగాయని తనుశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా 2024 సంవత్సరంలో ఎవరో తన కారు బ్రేక్‌లను తీసేయడానికి ప్రయత్నించారని, దుండగులు ప్రతిచోటా తను వెళ్లే ప్రదేశాలకు వెంబడించేవారని ఆమె ఆరోపించారు. తన జీవితాన్ని ఆయన నరకప్రాయం చేశారని మండిపడ్డారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రతికూల వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. జనం ఇంత మూర్ఖంగా ఎలా ఉండగలరో తాను అస్సలు ఊహించలేకపోతున్నానని అన్నారు. ఒక వ్యక్తితో సమాజానికి లేదా ప్రపంచానికి ఉన్న అనుభవాలు వేరుగా ఉండవచ్చని, కానీ తనకెదురైన అనుభవాలు మాత్రం పూర్తిగా వేరని ఆమె స్పష్టం చేశారు. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన జీవితంలో వారు చేసిన నేరాలు, వేధింపులన్నీ వాటంతట అవే మాఫీ అయిపోతాయా అని ఆమె ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఆ లెజండ్ ని చెంప దెబ్బ కొట్టిన రకుల్: వైరల్ గా మారిన న్యూస్

కొందరు వ్యక్తులు నానా మరణం తర్వాత ఆయన్ని మన్నించాలంటూ తనకు సలహాలు ఇస్తున్నారని, కానీ ఆయన తన జీవితంలో ఎప్పుడూ తనను క్షమాపణ కోరలేదని తనుశ్రీ తెలిపారు. కనీసం తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరకపోతే దేవుడు కూడా క్షమించడని, ముందు చేసిన నేరాన్ని అంగీకరించి ఒకరి జీవితాన్ని నాశనం చేశామన్న నిజాన్ని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అలాంటి క్షమాపణ ఎప్పుడూ జరగలేదని, కనీసం ఆయన మరణంలోనూ తనకు అనేక సమస్యలను తెచ్చిపెట్టారని అందుకే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. తనపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న నెటిజన్లు ఒక్కసారి తన స్థానంలో నిలబడి ఆలోచించాలని కోరారు. కాగా, తనుశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలను ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తీవ్రంగా ఖండించింది. మరణించిన వ్యక్తి గురించి ఇలాంటి పదజాలం ఉపయోగించడం సిగ్గుచేటని, ఇప్పటికైనా తన మాటలను అదుపులో పెట్టుకోవాలని తనుశ్రీకి గట్టిగా హితవు పలికింది.
[Tanushree Dutta About Nana Patekar, Tanushree Dutta, Nana Patekar, MeToo movement, Nana Patekar death, Bollywood news,telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]




.webp)

