'వకీల్ సాబ్'తో తమన్నా?
on Jul 1, 2020
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రెండు సిన్మాలు చేస్తున్నారు. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటిస్తున్న హిస్టారికల్ ఫాంటసీ ఫిలింతో పోలిస్తే... బాలీవుడ్ హిట్ 'పింక్'కి రీమేక్ గా తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. అయితే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా నటించబోయే కథానాయికను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కొన్ని రోజుల క్రితం శృతిహాసన్ పేరు వినిపించింది. అయితే పవన్ సినిమాలో తాను నటించడం లేదని ఆమె స్వయంగా వెల్లడించింది. తర్వాత లావణ్య త్రిపాఠి పేరు వినిపించింది. ఇప్పుడు తమన్నా పేరు వినబడుతోంది.
'వకీల్ సాబ్' సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో, అతనికి జోడీగా తమన్నా నటించే అవకాశం ఉందట. ఇంతకుముందు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో పవన్, తమన్నా జంటగా నటించారు. తర్వాత మరో సినిమా చేయలేదు. పవన్ సరసన పాత్ర... అదీ ఓ పాట, రెండు మూడు సన్నివేశాలే కావడంతో తమన్నా ఎస్ చెప్పారట.
ఇటీవల 'వకీల్ సాబ్'లో న్యాయవాదిగా పవన్ గెటప్ లీక్ అయింది. ఆల్రెడీ సినిమాలో కీలకమైన కోర్ట్ రూమ్ సన్నివేశాలతో పాటు మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు కొన్ని సీన్స్ తీస్తే సినిమా కంప్లీట్ అవుతుందట.