ఇండియన్ క్రికెటర్ తో డేటింగ్.. పాక్ క్రికెటర్ తో పెళ్లి..!
on Aug 5, 2025

సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి రకరకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి వంటి విషయాల గురించి ఎన్నో వార్తలు పుట్టుకొస్తుంటాయి. నిప్పు లేనిదే పొగ రాదు అనే మాటను ఫాలో అవుతూ.. ఆ వార్తలను నమ్మేవారు ఎందరో ఉంటారు. ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా విషయంలోనూ అదే జరిగింది. (Tamannaah Bhatia)
పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ను తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలను తాజాగా తమన్నా ఖండించండి. ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కోసం వెళ్ళినప్పుడు అబ్దుల్ రజాక్ ను కలిశాను తప్ప.. తమ మధ్య వ్యక్తిగత పరిచయం లేదని తమన్నా తెలిపింది. ఒక ఈవెంట్ లో కనిపించినంత మాత్రాన.. పెళ్లి రూమర్స్ రావడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పింది.
ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో తమన్నా డేటింగ్ లో ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిపై కూడా తమన్నా స్పందించింది. తాను విరాట్ ను కలిసిందే ఒకసారని, అయినా డేటింగ్ రూమర్లు వచ్చాయని, ఆ సమయంలో తాను మానసికంగా ఇబ్బంది పడ్డానని తమన్నా చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే, కొంతకాలం క్రితం నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ లో ఉంది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఏవో కారణాల వల్ల వీరికి బ్రేకప్ అయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



