TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఆ హీరోతో 10 సినిమాలు చేయడానికైనా తమన్నా రెడీ

May 22, 2020 4:39PM

సినిమాలో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరితే... ఆ జంటను మళ్ళీ రిపీట్ చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే చాలా మంది హీరోలతో తమన్నా ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేసింది. ఏ హీరో పక్కన అయినా ఆమె జోడీగా భలే ఉంటుంది. హీరోలందరితో తమన్నా కెమిస్ట్రీ బాగుంటుంది. అందుకని ఆమెను రిపీట్ చేస్తాను. తాజాగా రవితేజ పక్కన ఆమెను మరోసారి రిపీట్ చేయాలని దర్శకుడు త్రినాథరావు నక్కిన అనుకున్నారు.

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా తమన్నాను అనుకున్నారు. ఆల్రెడీ 'బెంగాల్ టైగర్'లో హీరో హీరోయిన్ జంటగా నటించారు. అయితే ఈ సినిమా కోసం తమన్నా చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ కోట్ చేసిందని వార్తలు వచ్చాయి. వాటిలో నిజం లేదని తమన్నా చెబుతోంది. రవితేజ సరసన 10 సినిమాలైన చేయడానికి తాను రెడీ అని ఆమె అన్నది. రవితేజ సినిమా ప్రొడక్షన్ హౌస్ తన మేనేజ్మెంట్ టీం తో టచ్ లో ఉందని, లాక్ డౌన్ వల్ల చర్చలు ఆగాయని ఆమె తెలిపింది.

google-ad-img