హీరోయిన్లు చేస్తున్నది ఇష్టం లేదన్న తాప్సీ
on May 7, 2020
లాక్డౌన్లో ప్రజలందరూ ఇళ్లలో లాక్ అయ్యారు. ఎవరికీ ఇంకో ఆప్షన్ లేదు. ఎప్పుడూ షూటింగులు, ఫొటోషూట్లు అంటూ బిజీ బిజీగా గడిపే హీరోయిన్లకూ లాక్డౌన్లో ఫ్రీ టైమ్ దొరికింది. చాలామంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అలాగని, వర్కవుట్స్ చేయడంతో పాటు డైట్‌ని కంట్రోల్లో ఉంచుకోవడం మానడం లేదు. ఏమో? మళ్లీ ఎప్పుడు షూటింగులు స్టార్ట్ చేస్తారో? అని అలర్ట్‌గా ఉంటున్నారు. అలాగే, ప్రేక్షకులు వర్కవుట్ చేసేలా మోటివేట్ చేయడం కోసం సోషల్ మీడియాలో వర్కవుట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు.
తాప్సీ మాత్రం ఇప్పటి వరకూ ఒక్క వర్కవుట్ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఏదో ఒకసారి ఫొటో పోస్ట్ చేశారంతే. అలాగని, ఫిట్నెస్ విషయంలో తాప్సీ లైట్ తీసుకుందని అనుకుంటే పొరపాటే. ఫోనులో మెడిటేషన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మరీ ప్రాక్టీస్ చేస్తున్నారట. ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదు, మెంటల్ ఫిట్నెస్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నానని తాప్సీ తెలిపారు. ఇంట్లో ఎలాగో వర్కవుట్స్ చేస్తున్నానని ఆమె అన్నారు. మరి, వర్కవుట్ ఫొటోలు వీడియోలు ఎందుకు పోస్ట్ చేయడం లేదని అడిగితే... ‘‘అవును. నేను పోస్ట్ చేయను. వర్కవుట్స్ చేసేటప్పుడు ఫొటోలు, వీడియోస్ తీసుకోవడం నాకిష్టం ఉండదు. అవి తీసుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కాదని నేను భావిస్తా’’ అని చెప్పారు. హీరోయిన్లు అందరూ వర్కవుట్ వీడియోస్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాప్సీకి అవి ఇష్టం లేదన్నమాట!
Also Read