హీరో మేనేజర్, పీఆర్వోనీ పోలీసులు వదల్లేదు
Jun 19, 2020 2:16PM

బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. గురువారం సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని బాంద్రా పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. సుమారు 10 గంటల పాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. సుశాంత్ వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన స్నేహాలు, సంబంధాల గురించి ప్రశ్నించినట్టు ముంబై గుసగుస. సుశాంత్ ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు 15 మందిని విచారించినట్లు సమాచారం.
సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి తో పాటు అతని మేనేజర్ శృతి, పీఆర్వో రాధికా నిహ్లానీనీ పోలీసులు వదల్లేదు. వాళ్ళిద్దరి నీ స్టేషన్ కి పిలిచి సుశాంత్ ఆర్థిక స్థితిగతుల గురించి, బాలీవుడ్ ఇండస్ట్రీ లో పరిస్థితుల గురించి ప్రశ్నించారట. సుశాంత్ దగ్గర తాను జూలై 2019 నుండి ఫిబ్రవరి 2020 వరకు మేనేజర్ గా పని చేశాననీ, ఫైనాన్షియల్ విషయానికి వస్తే సుశాంత్ చాలా సౌండ్ అని శ్రుతి చెప్పినట్లు వినికిడి.
సుశాంత్ సన్నిహితులను ప్రశ్నించిన పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం బాలీవుడ్ బడా సంస్థలను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ముంబై టాక్. పోలీసుల విచారణలో కొన్ని రోజుల క్రితమే పనివాళ్లకు రాబోయే మూడు నెలలకు జీతాలు ఇచ్చిన సుశాంత్, వాళ్లతో ఇకపై తాను జీతాలు ఇవ్వలేనేమోనని చెప్పినట్లు తెలిసిందట.




