TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

సుశాంత్.. ఆద్యంతాలు ఒకేలా..

Jun 17, 2020 7:39PM

 

వెండితెర ధోని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం యావత్ భారతీయ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసినా.. నటుడిగా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు సుశాంత్. 2013లో విడుదలైన ‘కై పో చే’తో వెండితెరపై తొలి అడుగు వేసిన సుశాంత్.. 2020 నాటికి 12 సినిమాలు పూర్తి చేసేశాడు. వీటిలో ‘కై పో చే’(2013), ‘శుద్ద్ దేశీ రొమాన్స్’(2013), ‘పీకే’(2014), ‘యం.యస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’(2016), ‘చిచ్చోరే’(2019) మంచి విజయం సాధించాయి. సుశాంత్ 12వ చిత్రంగా రూపొందిన ‘దిల్ బేచారా’ త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ కాబోతోంది.

ప్రస్తావించదగ్గ విషయం ఏమంటే.. సుశాంత్ నటించిన మొదటి సినిమా, చివరి చిత్రం.. రెండూ కూడా నవలాధారిత చిత్రాలే. ‘కై పో చే’ విషయానికొస్తే.. ప్రముఖ నవలా రచయిత చేతన్ భగత్ రచించిన ‘ద 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ని బేస్ చేసుకుని తెరకెక్కింది. అభిషేక్ కపూర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇందులో సుశాంత్‌తో పాటు రాజ్ కుమార్ రావ్‌, అమిత్ స‌ద్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇక ‘దిల్ బేచారా’ విషయానికొస్తే.. జాన్ గ్రీన్ రచించిన ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవలాధారంగా తయారైంది. కాకపోతే.. అదే పేరుతో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’(2014)కి రీమేక్ వెర్షన్‌గా ‘దిల్ బేచారా’ని తీర్చిదిద్దారు. ముకేష్ ఛబ్రా దర్శకుడిగానూ, సంజనా సంఘై నాయికగానూ పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది. ఏ.ఆర్.రెహమాన్ బాణీలు అందించాడు.

మొత్తమ్మీద సుశాంత్ తొలి, చివరి సినిమాలు నవాలాధారిత చిత్రాలు కావడం విశేష‌మనే చెప్పాలి. ‘కై పో చే’ జనాదరణ పొందిన నేపథ్యంలో.. విషాదాంత ప్రేమకథ అయిన ‘దిల్ బేచారా’ కూడా వీక్షకులను అలరిస్తుందేమో చూడాలి.

google-ad-img