Home

»

Latest News

Suriya: సూర్య అప్ కమింగ్ మూవీకి షాకింగ్ బిజినెస్.. కరుప్పు హిట్ కదా!

May 26, 2026 9:36AM

 

హిట్ ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో స్టార్ హీరో సూర్య(Surya)కి కరుప్పు(Karuppu)ఉరఫ్ వీరభద్రుడు(Veerabhadrudu)తో చాలా రోజుల తర్వాత తెలిసి వచ్చింది. ఆఫ్ కోర్స్ సూర్య హిట్ ల ముఖం చూడలేదని కాదు. కాకపోతే గత కొంత కాలంగా సూర్య కి హిట్ లు కరువయ్యాయి. దీంతో ఇప్పుడు కరుప్పు సూర్యకి సంజీవిని అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 250 కోట్లు రాబట్టగా  వీరభద్రుడు గా తెలుగులో దాదాపు 25 కోట్ల గ్రాస్ రాబట్టింది. ముఖ్యంగా ఆంధ్రా ఏరియాలో (రాయలసీమ కాకుండా) కేవలం 3 కోట్ల రేషియోలో అడ్వాన్స్‌ల రూపంలో థియేట్రికల్ రైట్స్ ఇస్తే, అది కాస్తా ఏకంగా  6 కోట్ల వరకు వసూలు చేసి ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.


 దీంతో ఇప్పుడు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venki Atluri)తో చేస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' బిజినెస్ లెక్కలు మారిపోయాయి. నిజానికి  ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్యతో  'సార్', 'లక్కీ భాస్కర్' వంటి వరుస మైండ్‌బ్లోయింగ్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న వెంకీ అట్లూరి కలవడంతో    బిజినెస్ పరంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రాజెక్ట్‌ కి  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

ప్రస్తుతం ఈ చిత్రం ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ (రాయలసీమ మినహాయించి) సొంతం చేసుకునేందుకు ప్రముఖ బయ్యర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్లు పోటాపోటీగా రంగంలోకి దిగుతున్నారు. ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం  'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆంధ్రా రైట్స్ కోసం నిర్మాతలు ఏకంగా 10 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయల వరకు NRA (Non-Returnable Advance) రేటు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక తమిళ హీరో నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమాకు, అందునా కేవలం ఆంధ్రా ఏరియాకే ఈ స్థాయిలో రేటు పలకడం సంచలనంగా మారింది.

వెంకీ అట్లూరి సక్సెస్ గ్రాఫ్, సూర్యకి  తెలుగు ఆడియెన్స్‌లో ఉన్న తిరుగులేని క్రేజ్ తోడవ్వడంతో బయ్యర్లు కూడా ఈ భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనకాడటం లేదు. సినిమాకు థియేటర్లలో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ పెట్టుబడిని రికవరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య, మమితా బైజు జంటగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం జూలై 2026లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఓటిటి పరంగా కూడా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే భారీ ధరకే సొంతం చేసుకుంది.

 

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com