TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మరో రామాయణ సినిమా తియ్యండి: సుప్రీం కోర్ట్ సంచలన ప్రకటన..వాట్ నెక్స్ట్!

Nov 27, 2026 1:25PM

 

కొంత మంది అపర మేధావుల్లా  'రామాయణ' మూవీపై పలు విషయాలకి సంబంధించి కేసులు వేసిన విషయం తెలిసిందే. రామాయణలో ఇతిహాసానికి సంబంధించిన వాస్తవాలని వక్రీకరించారంటూ ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించడం ప్రధాన హైలెట్. మరి ఆ విశేషాలని చూద్దాం.

 'రామాయణ' లో ఇతిహాసానికి సంబంధించిన అనేక అంశాలని తప్పుగా చూపించారని పిటిషనర్ ఆరోపించాడు. ముఖ్యంగా కొత్త తరానికి రామాయణం గురించి తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పిటిషన్ నవంబర్ 23న రిజిస్టర్ అయినప్పటికీ విచారణకు జాబితా కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ అభ్యర్థనను పరిశీలించింది. సినిమాలో వాస్తవాలను వక్రీకరించారంటూ న్యాయవాది వాదించగా.. సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలైందని, చూడాలనుకున్నవారు చూసేశారని సీజేఐ వ్యాఖ్యానించారు.

దర్శకులు తమకు అర్థమైన విధంగా సినిమా తీశారని, ఇతిహాసంపై భిన్నమైన అభిప్రాయం ఉంటే అలాంటి వారు తమ దృక్కోణంతో మరో సినిమా తీసుకోవచ్చని జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి సూచించారు. వాళ్లు తమకు అర్థమైన విధంగా సినిమా తీశారు. మీకు మరో అభిప్రాయం ఉంటే మీరు కూడా సినిమా తీయండి. కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు' అన్న తరహాలో ధర్మాసనం స్పందించింది.

ఇది కూడా చదవండి:ఈ హీరోయిన్ ఇంట్లో ప్రేమంటే అదే అర్ధం అంట: బాంబ్ పేల్చిన బ్యూటీ!

దీంతో రామాయణ సినిమాపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే పిటిషన్ పూర్తిగా కొట్టివేసినట్లు కాదు.. అత్యవసర విచారణకు మాత్రమే అంగీకరించలేదు.

నవంబర్ 5న విడుదలైన రామాయణ ప్రస్తుతం 1500 కోట్ల క్లబ్ ని దాటి తన సత్తా చాటుతూ ఉంది.మొత్తానికి రామాయణం లాంటి ఇతిహాసాలను వెండితెరపై చూపించడం ఎంతటి సవాలో ఈ వివాదం మరోసారి గుర్తుచేస్తోంది. మరి ఈ సినిమాపై భవిష్యత్తులో ఇంకెన్ని చర్చలు మొదలవుతాయో చూడాలి.

 

మీకు నచ్చవచ్చు

ప్రముఖ హీరోయిన్ పెళ్లి: అల్లు అరవింద్ దే బాధ్యత మొత్తం!

సెకండ్ ఆఫ్ ఉంది భయ్యా: ఫస్ట్ హాఫ్ వంద రెట్లు బెస్ట్! 

 

[Ramayana, Supreem Court, Yash, sai Pallavi, Nitesh Tiwari, Bollywood]
 
    

 

google-ad-img