ఇందిరాగాంధీ పాత్రలో పోర్న్ స్టార్
on Mar 21, 2014
బాలీవుడ్ హాట్ భామ సన్నీ లియోన్ నటించిన తాజా చిత్రం "రాగిణి ఎంఎంఎస్-2". ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సన్నీ మీడియాతో మాట్లాడుతూ... అవకాశం వస్తే నటిగా నన్ను నేను నిరుపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇందిరాగాంధీ పాత్రను పోషించడానికి కూడా సిద్ధమే. ఆమె శక్తిమంతమైన రాజకీయనాయకురాలు. ఆమె పాత్రలో నటించడం ఓ అదృష్టం. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా, ఏక్తా కపూర్, కత్రినా కైఫ్ లను ఆదర్శంగా తీసుకుంటాను. పది మందికి స్పూర్తినిచ్చే మహిళలు వీళ్ళు. ప్రస్తుతం నా గతజీవితం గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు నా జీవితంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఇదంతా కేవలం నేను బాలీవుడ్ సినిమాల్లో నటిగా నటించడం వల్ల మాత్రమే. నా సినిమాలు నచ్చనివాళ్ళు థియేటర్లకు రాకండి లేదా టీవీలు ఆఫ్ చేసుకోండి" అని తెలిపింది.