వామ్మో నిమిషానికి 3లక్షలంట!
on Aug 7, 2013
పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కి బాలీవుడ్ లో బాగానే ఆఫర్లు వస్తున్నాయి. ఈ అమ్మడు నటించిన ప్రతి చిత్రం కూడా బయ్యర్లకు బాగానే కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ అమ్మడు ఇటీవలే ఓ చిత్రంలో నటించడానికి పదిహేను లక్షలు అడిగిందట. ఇంకేం మరి ఇంతకి ఈ అమ్మడు సినిమా మొత్తం ఉండి, ప్రేక్షకులకు పిచ్చేక్కిస్తుంది అని అనుకున్తున్నారా? అక్కడే ఈ అమ్మడు మెలిక పెట్టింది. ఈ అమ్మడు ఈ చిత్రంలో నటించేది కేవలం 5 నిమిషాలు మాత్రమేనంట. ఈ 5 నిమిషాలకే 15 లక్షలు తీసుకుంటుందట. అంటే నిమిషానికి అక్షరాల 3 లక్షలన్నమాట. రొమాంటిక్ హార్రర్ తరహాలో రూపొందుతున్న ఈ చిత్రం 3Dలో తెరకెక్కుతుంది. మరి ఈ 5 నిమిషాలలో సన్నీని దర్శకుడు ఎలా చూపించనున్నాడో మరి.