సన్నీ ఫోటో లీక్ చేసిన మంచు లక్ష్మి
Jul 10, 2014 2:17PM

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కరెంటు తీగ’ సినిమాలో సన్నీ లియోన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె ఒక టీచర్ పాత్ర పోషిస్తోందని సమాచారం. ఈ సినిమా సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట చిత్రీకరణలో సన్నీ, మనోజ్ పాల్గొంటు కనిపిస్తున్న ఒక ఫోటోని మంచు లక్ష్మి పోస్ట్ చేశారు. డాన్స్ మాస్టర్ బృందా విరగదీస్తోంది అంటూ కామెంట్ తో లక్ష్మి ఈ ఫోటోని పోస్ట్ చేసి, ఎవరికీ చెప్పకండి అంటూ చమత్కరించింది. ఏమైనా కరెంటు తీగ స్టిల్ చూస్తే లుంగీ అవతారాలతో మనోజ్, సన్నీ నిజంగానే విరగదీస్తున్నారనిపిస్తోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మంచు విష్ణు నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.




