TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

పోటుగాడి పక్కన సంప్రదాయంగా సన్నీలియోన్

May 19, 2014 10:50AM

Sunny Leone in Tollywood, Manchu Manoj Sunny Leone Telugu Movie, Sunny Leone Telugu Movie News, Sunny Leone Latest Updates

అసలే పోర్న్ స్టార్... ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. పూజాభట్, ఏక్తా కపూర్ లతో జతకట్టి సినిమాల్లో నటించేసింది సన్నీలియోన్. ఆమె కాలు కదిపినా, వేలు మీటినా మీడియాలో సంచలనమే. బాలీవుడ్‌లో "రాగిణి ఎం.ఎం.ఎస్ 2" చిత్రంతో బాక్సాఫీసు రికార్డులను బద్దలుకొట్టిన సన్నీలియోన్.. ఇటీవల "వడాకర్రీ" అనే తమిళ చిత్రం ఐటెం సాంగ్‌లో మెరిసింది.
ఈ సెక్సీ స్టార్ బోల్డ్ లుక్స్ లో మాత్రమే చూసిన అభిమానులకు ఇప్పుటు కొత్త గెటప్ లో కనిపించబోతోంది. 

మంచు మనోజ్ నటిస్తున్న  "కరెంట్ తీగ" చిత్రంలో  సన్నీలియోన్ చాలా సాంప్రదాయబద్ధంగా.. నిండైన చీరలో కనిపించనుందని చిత్ర యూనిట్ అంటోంది.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. త్వరలో "కరెంట్ తీగ" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. "దేనికైనా రెడీ"తో సూపర్ సక్సెస్ అందుకొన్న జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు.

సన్నీ, చీరలో, సాంప్రదాయబద్దంగా, అసలు వినడానికి కొత్తగా ఉన్న ఈ కాంబీనేషన్  స్క్రీన్ మీద ఎలా వర్క అవుట్ అవుతుంతో, అభిమానులకు ఇది ఎంత వరకు ఆసక్తిని కలిగిస్తుందో చూడాలి.

google-ad-img