TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మీ భర్తలు నాకొద్దు అంటున్న సన్నీ

Mar 20, 2014 12:41PM

 

ఇప్పటివరకు తన అందాలతో పిచ్చేక్కించిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన బ్రాండ్ ను మార్చే ప్రయత్నంలో ఉంది. ఈ అమ్మడు గతంలో నీలిచిత్రాల్లో నటించి కుర్రకారుకు నిద్రల్లేకుండా చేసింది. అలాంటి ఈ అమ్మడు ఇటీవలే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమాల్లో కూడా తన అందాలను బీభత్సంగా ప్రదర్శిస్తూ.. బాలీవుడ్ ఐటెం భామలకే పెద్ద ఐటెం బాంబ్ ల మారింది. కానీ ఈ అమ్మడు మాత్రం తన మీద ఉన్న ఈ సెక్స్ బాంబ్ ముద్రను చెరిపేసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది.

అయితే ఈ విషయంపై సన్నీ... ప్రస్తుతం నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకోవాలనుకుంటున్నాను. కానీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన హాట్ పాత్రలను మాత్రం వదులుకోను. నా మీద బ్యాడ్ ఇమేజ్ ఉండటంవల్ల ఆడవాళ్లకు నేను నచ్చకపోవచ్చు. వాళ్ళ భర్తలను ఎక్కడ నా వ్యామోహంలో పడేస్తానేమోననే భయం ఉండొచ్చు. అందుకే "మీ భర్తలు నాకువద్దు" అని ఆడవాళ్లందరికి చెబుతున్నా. నా భర్త డానియెల్ చాలా హాట్ గా, సెక్సీగా ఉంటాడు. కాబట్టి నాకు వేరే మగాళ్ళ వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు. నా శ్రీవారికి కూడా వేరే ఆడవాళ్లతో పనిలేదు. సినిమాలో నేను చేసేవన్నీ కూడా నా నిజజీవితంతో కలపవద్దు" అని అన్నారు.

google-ad-img