TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

సుధీర్‌బాబు బర్త్‌డే స్పెషల్‌ ఇదే..!

May 13, 2024 4:20PM

హీరో సుధీర్‌ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘హరోం హర’ మేకర్స్‌ మురుగడి మాయ అనే కొత్త పాటను విడుదల చేశారు. టైటిల్‌ సూచించినట్లుగా, ప్రపంచంలో జరిగే ప్రతిచర్యకు కారణమైన మురుగన్‌ శక్తిని ఈ పాట నిర్వచిస్తుంది.

చైతన్‌ భరద్వాజ్‌ స్కోర్‌ చేసిన ఈ మెస్మరైజింగ్‌ నెంబర్‌ సుధీర్‌ బాబు, సునీల్‌  స్నేహాన్ని చూపుతుంది. రఘు కుంచె ఆ పాటను అద్భుతంగా పాడారు. భరద్వాజ పాత్రుడు కుప్పం యాసలో ఆకట్టుకునే లిరిక్స్‌ రాశారు. మొత్తంమీద, మురుగడి మాయ  అద్భుతమైన కంపోజిషన్‌, అర్థవంతమైన సాహిత్యం, ఆకట్టుకునే వోకల్స్‌ తో ఇన్స్టంట్‌ హిట్‌ అయ్యింది. సుధీర్‌ బాబు , సునీల్‌ బాండిరగ్‌ మరింత ఇంపాక్ట్‌ ని క్రియేట్‌ చేసింది.

ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌) బ్యానర్‌పై సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో మాళవిక శర్మ కథానాయిక. అరవింద్‌ విశ్వనాథన్‌ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ రవితేజ గిరిజాల. పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

google-ad-img