ఆ ఒక్కటి అడక్కు
on Aug 5, 2025
.webp)
సూపర్ స్టార్ 'మహేష్ బాబు'(Mahesh Babu)దర్శక ధీరుడు 'రాజమౌళి'(Rajamouli)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న'ssmb 29 '(వర్కింగ్ టైటిల్) పై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. దుర్గా ఆర్ట్స్ పై సీనియర్ ప్రొడ్యూసర్ 'కె ఎల్ నారాయణ' భారతీయ సినిమా చరిత్రలోనే ఇంతవరకు తెరకెక్కని హై బడ్జెట్ తో' ssmb 29 ' ని నిర్మిస్తున్నాడు. భారతీయనటులతో పాటు విదేశీ నటులు కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ' ssmb 29 ' పాన్ వరల్డ్ మూవీగా నిలిచే అవకాశం ఉంది.
ఆగస్టు 9 న మహేష్ బాబు బర్త్ డే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహేష్ అభిమానులకి పండుగ రోజు. ఈ పండుగకి మరింత జోష్ ని ఇచ్చేలా, 'ssmb 29 'నుంచి మహేష్ క్యారక్టర్ కి సంబంధించిన లుక్ ఏదైనా రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కానీ మేకర్స్ నుంచి అలాంటి వాతావరణం కనపడటంలేదు. రాజమౌళి ఇటీవల కొన్ని సినిమాల ఫంక్షన్స్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్స్ లో అభిమానులు,ssmb 29 గురించి చెప్పమని అడిగినా రాజమౌళి స్పందించలేదు. దీంతో మహేష్ బర్త్ డే కి ssmb 29 గురించి ఎలాంటి అప్ డేట్ రానట్టే. ఇప్పటికే మూడు షెడ్యూల్స్
ని పూర్తి చేసుకున్న టీం, తదుపరి షెడ్యూల్ 'సౌత్ ఆఫ్రికా'లోని 'టాంజానియా'లో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందు కెన్యాలో ప్లాన్ చేసినా, ఆ దేశ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆఫ్రికాకి మార్చారని టాక్ .
హాలీవుడ్ ,బాలీవుడ్ చిత్రాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న 'ప్రియాంక చోప్రా'(Priyanka Chopra)హీరోయిగా చేస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithvirah Sukumaran)కీలక పాత్రలో చేస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన షెడ్యూల్స్ లో మహేష్,ప్రియాంక, పృథ్వీ రాజ్ సుకుమారన్ పై పలు కీలక సన్నివేశాలని తెరకెక్కించారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ssmb 29 కి ఆర్ఆర్ఆర్, బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 ఫేమ్ 'విజయేంద్ర ప్రసాద్'(Vijayendra Prasad)కథకుడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి(M.M Keeravani)మ్యూజిక్.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



