
‘కేజీఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి పారితోషికంపై కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఒక్కో సినిమాకు ఆమె రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా స్పందించిన శ్రీనిధి.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో వచ్చిన విజయంతో శ్రీనిధి శెట్టి పారితోషికం భారీగా పెంచేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాను ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలేనని, అలాంటప్పుడు రూ.7–8 కోట్లు డిమాండ్ చేస్తున్నాననే ప్రచారం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆమె పేర్కొన్నారు. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు.
డబ్బు సంపాదించడమే తన లక్ష్యమైతే ఈపాటికి 20 నుంచి 30 సినిమాలు చేసి ఉండేదాన్నని శ్రీనిధి అన్నారు. కానీ తనకు నచ్చిన కథలు, మంచి పాత్రలు ఉన్న సినిమాలనే ఎంచుకోవాలని భావిస్తానని ఆమె తెలిపారు. పారితోషికం ఒక్కటే సినిమా అంగీకరించడానికి ప్రామాణికం కాదన్నది ఆమె మాటల్లో స్పష్టమవుతోంది.

యశ్ సరసన ‘కేజీఎఫ్’ చిత్రాల్లో రీనా దేశాయ్‌గా కనిపించిన శ్రీనిధి, ఆ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విక్రమ్‌తో ‘కోబ్రా’, నానితో ‘హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వెంకటేశ్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్నారు.
పాన్ ఇండియా గుర్తింపు వచ్చిన తర్వాత పారితోషికం పెంచుకోవడం సహజమే అయినా, తన విషయంలో మాత్రం డబ్బు కంటే కథ, పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని శ్రీనిధి చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరి ‘ఆదర్శ కుటుంబం’తో ఆమె ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
ఇది కూడా చదవండి: 'అత్తరు సాయిబో రారా' సాంగ్ ఫుల్ లిరిక్స్!
[Srinidhi Shetty Remuneration, Srinidhi Shetty 8 Crore Salary, Srinidhi Shetty, KGF Actress, Aadarsha Kutumbam, Venkatesh, Trivikram Srinivas, Telugu Film News]






