చరణ్ కు అన్నయ్యగా శ్రీకాంత్
on Dec 28, 2013
కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో చరణ్ కు అన్నయ్య పాత్రలో ముందుగా హీరో వెంకటేష్ ను అనుకున్నారు. కానీ తాజాగా వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఈ అవకాశాన్ని శ్రీకాంత్ కు దక్కింది. ఈ విషయంపై శ్రీకాంత్ మాట్లాడుతూ.. "కృష్ణవంశీ చెప్పిన కథ నచ్చడంతో అంగీకరించాను. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది" అని అన్నారు. ఇందులో రామ్ చరణ్ కు శ్రీకాంత్ అన్నయ్య పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.