ENGLISH | TELUGU  

దసరాకు వస్తున్న 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'.. హ్యాట్రిక్ పై కన్నేసిన నార్నె నితిన్! 

on Sep 8, 2024

మ్యాడ్, ఆయ్ సినిమాలతో వరుస ఘన విజయాలను అందుకొని దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్, "శతమానం భవతి" దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటించారు. సంపద హీరోయిన్ . ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకులకు ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ... "ముందుగా మమ్మల్ని మా బ్యానర్ ని ఆదరిస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి  యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతో తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఎన్టీఆర్ ఎంతో మెచ్చి... ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం." అని అన్నారు.

ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కైలాష్ మీనన్ సంగీతం అందించగా సినిమాటోగ్రాఫర్ గా దాము నర్రావుల, ఎడిటర్ గా మధు వ్యవహరించారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.