TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

త్వరలోనే ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’.. ఎన్టీఆర్ ఎంట్రీ..?

Jun 10, 2024 3:44PM

శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంపద హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ "శ్రీ శ్రీ శ్రీ రాజావారు". అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందటంతో పాటు, సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. "జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటించిన ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. అలాగే మా దర్శకులు సతీష్ వేగేశ్న  మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరుంది. ఆయన ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేస్తుంది. అలాగే మా సినిమా ఇటీవలే సెన్సార్ సభ్యుల ప్రశంసలతో యూ/ఏ సర్టిఫికెట్ పొందడం సంతోషంగా వుంది. అన్ని హంగులతో మా చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నాం." అన్నారు.

నార్నే నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు నటించిన ఈ చిత్రానికి కైలాష్ మీనన్ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా దాము నర్రావుల, ఎడిటర్ గా మధు వ్యవహరించారు.

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతారేమో చూడాలి.

google-ad-img