Home

»

Latest News

Sri gowri priya: తెలుగు హీరోలపై కోపం.. తమిళ హీరోలతో మాత్రం రొమాన్స్ నా!

Mar 21, 2026

 

 

-మ్యాడ్ లో శృతిగా ఫుల్ పాపులర్ 
-ఈ నెల 27 నా హ్యాపీ రాజ్ తో సెల్యులాయిడ్ పైకి 
-శ్రీ గౌరీ ప్రియకి హీరోలపై వివక్ష ఉందా!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతని, సోషల్ మీడియా లవర్స్ ని రామ్ నితిన్ చెంప పగలకొట్టింది ఎవరు అని సమయం, సందర్భం లేకపోయినా పర్లేదు అడగండి. వాళ్లంతా ఇంకేం మాట్లాకుండా శృతి' అని చెప్తారు. మనం అడిగింది మ్యాడ్ మూవీ గురించి అని వీళ్ళకెలా తెలుసు అని మనం అనుకుంటూ ఉంటే, వాళ్లేమో శృతి క్యారక్టర్ తో తమకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని గత స్మృతులు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంతలా  మ్యాడ్ లోని ఒకే ఒక చెంప దెబ్బ సన్నివేశంతో శ్రీ గౌరీప్రియ(Sri Gowri Priya)ఫుల్ పాపులర్ అయ్యింది. దీంతో తన అప్ కమింగ్ మూవీ హ్యాపీ రాజ్(Happy Raj)పై అభిమానులు ఒక లుక్ వేసి ఉంచారు. నిన్న హైదరాబాద్ లో సదరు మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా శ్రీ గౌరీప్రియ మాట్లాడిన మాటలు అభిమానులకి, సోషల్ మీడియాకి సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం.


ఆమె మాట్లాడుతు నేను తమిళ హీరోలతో రొమాంటిక్ గా, తెలుగు హీరోలతో యారంగిట్ గా ప్రవర్తిస్తూ కొడతానని అంటారు. నేను ఒక్క మూవీలో మాత్రమే హీరోని కొడతాను.అయినా నేనేమైనా హీరోలని కొట్టాలని కంకణం కట్టుకున్నానా! నాకు మాత్రం ఎవరి మీద కోపం లేదు. పైగా నేను తమిళ సినిమాల్లో ఏడుస్తానని, తెలుగు సినిమాల్లో మాత్రం సంతోషంగా ఉంటానని కూడా కొంత మంది  అంటారు. నాకు వచ్చిన ఆఫర్స్ మేరకే నా క్యారక్టర్ రియాక్షన్ ఉంటుందని  చెప్పుకొచ్చింది. 


Also read: Niharika konidela: నీహారిక కొణిదెల విడాకులకి కారణం తెలిసింది.. ఇదే అసలు నిజం 

కాకినాడకి చెందిన అచ్చ తెలుగింటి అమ్మాయి అయిన శ్రీ గౌరీప్రియ క్యారక్టర్ ఆర్టిస్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తమిళ్ లో మోడరన్ లవ్ చెన్నై, ట్రూ లవర్ వంటి చిత్రాల ద్వారా సోలో హీరోయిన్ గా తమిళ ప్రేక్షకులకి దగ్గర అయ్యింది. ఇప్పుడు హ్యాపీ రాజ్ తో తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి సందడి చేయనుంది. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ కుమార్  హీరో కాగా ముస్తఫా..ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా అంటూ తెలుగు రాష్టాల ప్రేక్షకులని తన మైకంలో పడేసిన హీరో అబ్బాస్ పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరియ రాజ్(Mariya raj)దర్శకుడు. మార్చి 27 రిలీజ్ డేట్.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com