TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

సౌత్ క్వీన్ కాజలే

May 14, 2014 4:48PM

మగధీరాలో అందాల యువరాణిగా తెలుగు ఆడియెన్స్ మనసులో నిండి పోయిన కాజల్ ఇప్పుడు ట్విట్టర్ లో కూడా సౌత్ క్వీన్ అయిపోయింది. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ కి వెళ్ళి అక్కడా చక్కటి హిట్స్ కొట్టేసిన ఈ పంచధార బొమ్మ సౌత్‌ హీరోయిన్లలో అందరి కన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ ని కలిగివుంది. ఆమెకు 10 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ వున్నారట. అందుకే సౌత్ లో ట్విట్టర్ క్వీన్ కిరీటం ఆమెకే దక్కుతుంది.

South Queen Kajal agarwal, Kajal agarwal Has Highest Twitter Followers, South Top Heroine Kajal agarwal, Tollywood Number One Heroine


బాలీవుడ్‌ లో  అమితాబ్‌ బచ్చన్‌ ఖాతాలో 12 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ వుండగా, ఆయన తర్వాత దీపికా పడుకొనే ట్విట్టర్‌ అకౌంట్‌ని ఎక్కువమంది ఫాలో అవుతున్నారు. సౌత్‌లో దాదాపు నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అన్పించుకున్న కాజల్ అగర్వాల్,  బాలీవుడ్‌లో నటించిన  ‘సింగం’  పెద్ద హిట్‌ అయ్యింది. లక్కీ చార్మ్ అని పేరున్న కాజల్ అభిమానులను సంపాదించటంలోనూ సో లక్కీ అనే చెప్పాలి.
పది మిలియన్ అభిమానులున్న కాజల్ వారిని సంపాదించుకోవడంతో పాటు దానిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని, వారి అభిమానమే తనని ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని అంటోంది కాజల్.

google-ad-img